EAMCET Answer Key: ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
టీఎస్ ఎంసెట్-2023 ప్రాథమిక కీ విడుదలైంది. ఎంసెట్ అగ్రికల్చర్ & మెడికల్ స్ట్రీమ్ ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసింది.
తెలంగాణ ఎంసెట్-2023 ప్రాథమిక కీ విడుదలైంది. ఎంసెట్ అగ్రికల్చర్ & మెడికల్ స్ట్రీం ఆన్‌లైన్ పరీక్షల ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి మే 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ సమాధానాలు చెక్ చేసుకోవచ్చు.
పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ సమాధాన పత్రాలు పొందడానికి ఎంసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి పొందవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 16లోపు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా పంపవచ్చు.
తెలంగాణలో ఎంసెట్ 2023 పరీక్షలు మే 10న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 14తో పరీక్షలు ముగిశాయి. అయితే మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ విభాగం పరీక్షలు జరగగా.. 12 నుంచి ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే మే 10, 11 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్ విభాగం పరీక్షల ఆన్సర్ కీని, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా పరీక్షలకు రాష్ట్రంలో 132 అబ్జర్వర్లను నియమించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 84 మంది అబ్జర్వర్లు విధులు నిర్వర్తించారు.
మాస్టర్ క్వశ్చన్ పేపర్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్)..
10 May 2023 FN (English & Telugu)
10 May 2023 AN (English & Telugu)
11 May 2023 FN (English & Telugu)
11 May 2023 AN (English & Telugu)
11 May 2023 AN (English & Urdu)
రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి..
అభ్యంతరాలు తెలిపేందుకు క్లిక్ చేయండి..
Also Read:
డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు, ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి రానుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచే 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత కూడా ఆపేయవచ్చు. మూడేళ్ల తర్వాత నిలిపివేసిన విద్యార్థులకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఇస్తారు. నాలుగేళ్లు పూర్తి చేసిన వారికి మాత్రం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తాజాగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌కు కూడా ఆనర్స్‌ను విస్తరించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
దోస్త్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..