TS POLYCET: విద్యార్థులకు అలర్ట్, రేపే టీఎస్ పాలిసెట్ ఫలితాలు! రిజిల్ట్స్ వెల్లడి సమయమిదే!
తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26న) విడుదల కానున్నాయి. మే 26న ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి. శ్రీనాథ్ ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణ పాలిసెట్ (TS POLYCET-2023) ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26న) విడుదల కానున్నాయి. మే 26న ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి. శ్రీనాథ్ ఫలితాలను వెల్లడించనున్నారు. పరీక్ష పూర్తయిన 8 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మే 17న పాలీసెట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 98,273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 92.94 శాతం హాజరు నమోదైంది. వీరిలో 54,700 మంది బాలురు; 43,573 మంది బాలికలు ఉన్నారు.
పాలిసెట్‌లో ఉత్తీర్ణులైనవాళ్లు ఇంజినీరింగ్, నాన్–ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత డిప్లొమా కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాల్లో చదువుకునే వీలుంది. అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సులను ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివర్సీటీలు అందిస్తున్నాయి.
వేర్వేరు ర్యాంకులు..
పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను తయారు చేస్తారు. టెక్నికల్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.
అర్హత మార్కులు..
➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు,
➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు తప్పనిసరిగా స్కోర్ చేయాలి.
Also Read:
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల - అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదు!
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు.
ఫలితాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..