TS PECET 2023: టీఎస్ పీఈసెట్ – 2023 షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
టీఎస్ పీఈసెట్ – 2023 షెడ్యూల్ విడుదలైంది. బీపీఎడ్( B.PEd ), డీపీఎడ్( D.PEd ) కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్( TS PECET ) నోటిఫికేషన్ మార్చి 13న విడుదల కానుంది.
టీఎస్ పీఈసెట్ – 2023 షెడ్యూల్ విడుదలైంది. బీపీఎడ్( B.PEd ), డీపీఎడ్( D.PEd ) కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్( TS PECET ) నోటిఫికేషన్ మార్చి 13న విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి( TSCHE ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీ, టీఎస్ పీఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల వీసీలు గోపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రాథోడ్ కలిసి మార్చి 9న షెడ్యూలు విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు మార్చి 15 నుంచి మే 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.500, మిగతా కేటగిరీల వారికి రూ.900గా ఫీజు నిర్ణయించారు. రూ. 500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 20 వరకు, రూ.5,000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 26 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి 10 వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. జూన్ మూడో వారంలో ఫలితాలను విడుదల చేయనున్నారు.
Also Read:
TS ECET - 2023: టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తు మొదలైంది, దరఖాస్తు చేసుకోండి - చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్యం రుసుంతో మే 8 వరకు, రూ.2500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 12 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
టీఎస్ఈసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటిపూట బడి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 12 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్ 17తో పరీక్షలు ముగియనున్నాయి.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి ..
TS ICET 2023: టీఎస్ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఐసెట్-2023' దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి మే 6 వరకు కొనసాగనుంది. విద్యార్థులు రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం కల్పించనున్నారు. మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు.
ఐసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..