News
News
X

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే?

తెలంగాణలోని పాఠశాలలకు మార్చి 15 నుంచి  ఒంటిపూట బడి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని పాఠశాలలకు మార్చి 15 నుంచి  ఒంటిపూట బడి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఏప్రిల్‌ 23 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది.

అలాగే రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 12 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మిగిలిన తరగతులకు ఏప్రిల్‌ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్‌ 17తో పరీక్షలు ముగియనున్నాయి.

Also Read:

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా...
షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.

ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 ఇంగ్లిష్
ఏప్రిల్ 8 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 10 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 11 సోషల్
ఏప్రిల్ 12 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 13 ఓరియంటెల్ పేపర్-2

పదోతరగతి 'ప్రీ ఫైనల్‌' పరీక్షల షెడ్యూలు విడుదల! ఇతర తరగతులకు 'ఎఫ్ఏ-4' పరీక్షలు ఎప్పుడంటే?
ఏపీలో పదోతరగతి విద్యా­ర్థులకు సంబంధించిన ప్రీ ఫైనల్‌ పరీక్షల తేదీలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 9 నుంచి 20 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ –2 కాంపోజిట్‌ పేపర్‌ మినహాయించి అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ –2 కాంపోజిట్‌ పేపర్‌ ఒక్కటే ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ మార్చి 1న షెడ్యూళ్లను ప్రకటించారు.

పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలతోపాటు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4 పరీక్షలను కూడా ఇవే తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి విద్యార్థులు సాధించిన మార్కులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్‌లో నిర్ణీత గడువులోగా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.
షెడ్యూలు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 09 Mar 2023 11:56 PM (IST) Tags: Half Day Schools Summer Holidays Education News in Telugu Half Day Schools in Telangana Telangana Half Day Schools TS School Timings

సంబంధిత కథనాలు

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

JEE Advanced 2023: జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?

JEE Advanced 2023: జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?

Sainik School Admissions: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?

Sainik School Admissions: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!