అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

తెలంగాణ లాసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TS LAWCET 2024: టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌‌సెట్‌ 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 25తో ముగిసిన గడువును మే 4 వరకు పొడిగించింది.

TS LAWCET Application: టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌‌సెట్‌ 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 15తో ముగియాల్సిన గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుకు గడువును మే 4 వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రూ.500 ఆలస్యరుసుముతో మే 10 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో మే 15 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో మే 20 వరకు, రూ.4000 ఆలస్యరుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్‌ (Lawcet Application Edit) చేసుకునేందుకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.900; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఇక పీజీఎల్‌‌సెట్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1100; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.900గా చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3న ఉదయం10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాసెట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జూన్ 6న ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి జూన్ 7న సాయంత్రం వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్షల బాధ్యతలను నిర్వహిస్తు్న్న సంగతి తెలిసిందే.

వివరాలు...

➥ తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ - 2024

కోర్సుల వివరాలు..

1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- ఎల్‌ఎల్‌బీ 

- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)

అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- బీఏ ఎల్‌ఎల్‌బీ

- బీకామ్ ఎల్‌ఎల్‌బీ

- బీబీఏ ఎల్‌ఎల్‌బీ

అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు

అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: లాసెట్, పీజీఎల్ సెట్ ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: 

➦ లాసెట్ దరఖాస్తుకు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

➦ పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది.

పరీక్ష విధానం, మార్కులు, సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష అర్హత మార్కులు: 

➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

➥ పీజీఎల్‌సెట్‌ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

ముఖ్యమైన తేదీలు..

➥ టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్: 29.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.05.2024.

➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 10.05.2024.

➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 15.05.2024.

➥ రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 20.05.2024.

➥ రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25.05.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 20.05.2024  నుంచి 25.05.2024 వరకు.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 30.05.2024.

➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 03.06.2024.

➥ ప్రాథమిక కీ విడుదల: 06.06.2024.

➥ ప్రాథమిక ఆన్సర్ కీ అభ్యంతరాల గడువు: 07.06.2024.

➥ తుది కీ, ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.

పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.

Notification

Application Fee Payment
Fill Application Form
Payment Status
Download Application Form

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget