TS LAWCET: నేడే లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు- హాజరుకానున్న 43,692 మంది అభ్యర్థులు!
టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్-2023 ప్రవేశ పరీక్షలను మే 25న నిర్వహించనున్నారు. ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్-2023 ప్రవేశ పరీక్షలను మే 25న నిర్వహించనున్నారు. ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మూడేళ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌ను ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక ఐదేళ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు మూడో సెషన్‌లో సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
మొదటి, రెండో సెషన్లకు తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో సెషన్‌కు తెలంగాణలో 41, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజరు కానున్నారు. మూడేళ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సులకు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్‌లో పొందుపరిచిన అంశాలను ప్రతి అభ్యర్థి పరిగణనలోకి తీసుకోవాలని కన్వీనర్ సూచించారు.
పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.
పరీక్ష విధానం, మార్కులు, సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష అర్హత మార్కులు:
➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
➥ పీజీఎల్‌సెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
లాసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
టీఎస్ పీజీఈసెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
తెలంగాణలో పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)-2023 హాల్‌టికెట్లను జేఎన్‌టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, పరీక్ష పేపర్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు పీజీఈసెట్ దరఖాస్తు గడువు రూ.2500 ఆలస్య రుసుముతో మే 24తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఐసెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష తేదీలివే!
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి మే 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన సంగతి తెలిసిందే.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..