News
News
X

Toll Free Number: ఇంటర్ పరీక్షల భయమా? అయితే ఈ 'టోల్‌ ఫ్రీ' నంబర్‌‌కు కాల్ చేయండి!

మానసిక, ఇతర సమస్యలున్న విద్యార్థులకు సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉండి కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు తగిన పరిష్కారాలను సూచిస్తారు. ఇది రోజంతా పనిచేస్తుంది.

FOLLOW US: 
Share:

ఇంటర్‌ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం, ఆందోళన నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకొన్నది. వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్‌ సేవలను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఇచ్చింది. విద్యార్థులు 14416 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి, ఒత్తిడి తగ్గించుకోవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఈ టెలిమానస్‌ ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా, విద్యార్థుల్లో ఆందోళన, భయం, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. దీంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని సూచించారు.

హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో పరీక్షల ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉంటే మానసిక నిపుణులకు చెప్పుకొని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కొందరు సైకాలజిస్టులను ఇంటర్‌బోర్డు నియమించేది. తాజాగా టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండర్ నెట్‌వర్కింగ్ అక్రాస్ ది స్టేట్స్(టెలీ-మానస్) పేరిట టోల్ ఫ్రీ నంబరు 14416ను తీసుకొచ్చారు. ఈ నంబరుకు ఉచితంగా ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. 

ఇంటర్ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయాల్లో దాన్ని వినియోగించుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉండి కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు తగిన పరిష్కారాలను సూచిస్తారు. ఇది రోజంతా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆయా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్‌ల పేరిట ఉచితంగా సైకాలజిస్టులు సేవలు అందిస్తారు. వారిని స్వయంగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మార్చి 15 నుంచి రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 9.50 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు:

  • మార్చి 15 - బుధవారం - 2nd లంగ్వేజ్ పేపర్ 1
  • మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లీష్ పేపర్ 1
  • మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌ 1ఎ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
  • మార్చి 23 - గురువారం - మ్యాథ్స్ 1బి, హిస్టరీ పేపర్ 1, జువాలజీ పేపర్ 1
  • మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనావిుక్స్‌ పేపర్ 1
  • మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
  • మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)
  • ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:

  • మార్చి 16 - గురువారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2
  • మార్చి 18 - శనివారం - ఇంగ్లీష్‌ పేపర్ 2
  • మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్‌ పేపర్‌ 2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్‌ 2
  • మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేసర్ 2బి, హిస్టరీ పేపర్‌ 2, జువాలజీ పేపర్‌ 2
  • మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్‌ 2, ఎకనావిుక్స్‌ పేపర్‌ 2
  • మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్‌ 2, కామర్స్ పేపర్‌ 2
  • ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్‌ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌ 2 (బైపీసీ విద్యార్థులకు)
  • ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌ 2, జియోగ్రఫీ పేపర్‌ 2

ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 04 Mar 2023 02:03 PM (IST) Tags: Telangana Inter Board Intermediate Exams Education News in Telugu Toll Free Number Inter Students Inter Exam Tension

సంబంధిత కథనాలు

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

Summer Holidays: తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం! సమ్మర్ హాలీడేస్ ఎన్నిరోజులంటే?

Summer Holidays: తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం! సమ్మర్ హాలీడేస్ ఎన్నిరోజులంటే?

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు