అన్వేషించండి

TG EDCET Results: నేడే తెలంగాణ ఎడ్‌సెట్‌ - 2024 ఫలితాలు, రిజల్ట్ వెల్లడి సమయమిదే!

TG EDCET 2024: టీఎస్‌ఎడ్‌సెట్-2024 ఫలితాలు జూన్ 11న విడుదలకానున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు  ఫ‌లితాల‌ను వెల్లడించనున్నారు.

TG EDCET 2024 Results: తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఎడ్‌సెట్-2024 ఫలితాలు నేడు (జూన్ 11న) వెలువడనున్నాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు  ఫ‌లితాల‌ను వెల్లడించనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. గతేడాది ఎడ్‌సెట్ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే 23న రెండు సెష‌న్లలో టీజీఎడ్‌సెట్-2024 ప‌రీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2  నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొదటి సెష‌న్‌‌లో నిర్వహించిన పరీక్షకు 16,929 మందికి గానూ 14,633 మంది, రెండో సెష‌న్ 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు హాజ‌ర‌య్యారు. మొత్తం 87% హాజరుశాతం నమోదైంది. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల బాధ్యత చేపట్టింది. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఎడ్‌సెట్-2024 ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://edcet.tsche.ac.in/

➥ అక్కడ హోంపేజిలో కనిపించే ఫలితాలు/ర్యాంకు కార్డుకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ ఆ తర్వాత వచ్చే పేజీలో విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Result/View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 

➥ ప్రవేశ పరీక్ష ఫలితాలు/ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

➥ విద్యార్థులు ఫలితాలు/ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

ఎడ్‌సెట్ ఫ‌లితాలు, ర్యాంకు కార్డుల కోసం వెబ్‌సైట్..

పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు.

అర్హత మార్కులు.. 
ఎడ్‌సెట్-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి అర్హత మార్కులను 25 శాతం (38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

ALSO READ:

తెలంగాణ డీఈఈసెట్‌ దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్‌-2024' నోటిఫికేషన్‌ జూన్ 6న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా రెండేళ్ల కాలపరిమతితో ఉండే డీఎల్ఈడీ, డీపీఎస్‌ఈ  కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 8న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 30 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఈ ఏడాది సెప్టెంబరు 1 నాటికి 17 సంవత్సరాలు నిండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీచేస్తారు.
డీఈఈసెట్ నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Embed widget