TG DEECET 2024: తెలంగాణ డీఈఈసెట్ దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
DEECET 2024: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డీఈఈసెట్-2024 దరఖాస్తు ప్రక్రియను జూన్ 8న ప్రారంభించింది. సరైన అర్హతలున్నవారు జూన్ 30 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
TG DEECET 2024 Application: తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ (ఎలిమెంటరీ టీచర్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2024' (TG DEECET) నోటిఫికేషన్ జూన్ 6న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా రెండేళ్ల కాలపరిమతితో ఉండే డీఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 8న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 30 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఈ ఏడాది సెప్టెంబరు 1 నాటికి 17 సంవత్సరాలు నిండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీచేస్తారు.
అభ్యర్థులకు జులై 17న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 3 నుంచి అందుబాటులో ఉంచుతారు. ఇక ఫలితాలను జులై 16న ప్రకటిస్తారు. ఆ తర్వాత జులై 19 నుంచి 27 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి జులై 31న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 4 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి సీటు కేటాయింపును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆగస్టు 6 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
కోర్సుల వివరాలు..
* డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2024 (DEECET-2024)
కోర్సులు..
1) డీఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)
2) డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్)
కోర్సుల వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 17 సంవత్సరాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. వీటిలో పార్ట్-1: జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, పార్ట్-2: జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ తెలుగు/ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-3లో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఫిజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, బయోలాజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➪ డీఈఈసెట్ 2023 నోటిఫికేషన్: 06.06.2024.
➪ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 08.06.2024.
➪ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.06.2024.
➪ దరఖాస్తుల సవరణకు అవకాశం: 29.06.2024 - 30.06.2024.
➪ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు: 03.07.2024 నుంచి.
➪ ప్రవేశ పరీక్ష తేది: 10.07.2024.
➪ ఫలితాల వెల్లడి: 16.07.2024.
➪ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 19.07.2024 -23.07.2024.
➪ వెబ్ ఆప్షన్ల నమోదు: 24.07.2024 - 27.07.2024.
➪ సీట్ల కేటాయింపు: 31.07.2024.
➪ అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 01.08.2024 - 04.08.2024.
➪ తరగతులు ప్రారంభం: 06.08.2024.