TS EAPCET, టీఎస్ ఐసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు - కొత్త తేదీలు ఇవే!
Telangana Cets: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జరగాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల్లో మారాయి. TS EAPCET, టీఎస్ ఐసెట్ పరీక్షల షెడ్యూలులో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది.
TS CETS: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జరగాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల్లో మారాయి. TS EAPCET, టీఎస్ ఐసెట్ పరీక్షల షెడ్యూలులో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీఎస్ ఎప్‌సెట్ పరీక్షలను మే 9 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు, ఎన్నికల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి TS EAPCET తేదీలను మార్చింది. ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే టీఎస్ ఐసెట్ తేదీలను ఒకరోజు వెనక్కు జరిపారు.
➥ మారిన షెడ్యూలు ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు నిర్వహించాల్సిన ఈఏపీసెట్ పరీక్షలను మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు; మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ అలాగే ఐసెట్ పరీక్షను ఒక్క రోజు ముందుకు జరిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4, 5వ తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 6 వరకు ఎప్‌సెట్ దరఖాస్తులు..
ఎప్‌సెట్-2024 దరఖాస్తు ప్రక్రియ సోమవారం (ఫిబ్రవరి 26న) ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.250 ఆలస్య రుసుమతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
టీఎస్ ఎప్‌సెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
మే 6 వరకు ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ..
తెలంగాణ ఐసెట్(TS ICET)-2024 నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ మార్చి 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 7 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి అపరాధ రుసుములేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఫీజుగా ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 చెల్లించాలి. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక రూ.250 అపరాధ రుసుంతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20 వరకు సవరించుకోవచ్చు.
టీఎస్ ఐసెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..