TS ICET 2024: తెలంగాణ ఐసెట్- 2024 ప్రవేశ పరీక్ష స్వరూపం, సిలబస్ పూర్తి వివరాలు ఇలా
TS ICET: మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి.
TS ICET 2024 Application: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024–2025 విద్యాసంవత్సర ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్(TS ICET)-2024 నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ మార్చి 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐసెట్-2024కు మార్చి 7 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి అపరాధ రుసుములేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఐసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఫీజుగా ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 చెల్లించాలి. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక రూ.250 అపరాధ రుసుంతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20 వరకు సవరించుకోవచ్చు.
జూన్ 4, 5 తేదీల్లో పరీక్ష..
టీఎస్ ఐసెట్‌ను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టుగానే నిర్వహించనున్నారు. జూన్ 4న రెండు సెషన్లలో (ఉ.10 గం. - మ.12.30 వరకు; మధ్యాహ్నం 2.30 గం. - సా.5 గం. వరకు), జూన్ 5న ఒక సెషన్‌లో (ఉ.10 గం. - మ.12.30 వరకు) ప్రవేశ పరీక్ష జరుగనుంది. కాగా, జూన్ 15న ఐసెట్ ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జూన్ 28న ఫలితాలను విడుదల చేయనున్నారు.
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
పరీక్ష సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట, కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.
టీఎస్ ఐసెట్ ముఖ్యమైన తేదీలు..
➥ టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్: 05.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.
➥ రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 17.05.2024.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 27.05.2024.
➥ దరఖాస్తుల సవరణ: 17.05.2024 - 20.05.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 28.05.2024 నుంచి.
➥ ఐసెట్ పరీక్ష తేది: 04.06.2024, 05.06.2024 (కంప్యూటర్ బేస్డ్ విధానంలో).
సమయం: సెషన్-1: 10.00 A.M. to 12.30 P.M, సెషన్-2: 2.30 P.M. to 5.00 P.M, సెషన్-2: 10.00 A.M. to 12.30 P.M.
➥ ఐసెట్ ప్రాథమిక కీ: 15.06.2024.
➥ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 16.06.2024 - 19.06.2024 మధ్య
➥ ఐసెట్ ఫలితాల వెల్లడి: 28.06.2024.