అన్వేషించండి

TS EAPCET 2024 Results: టీఎస్ ఎప్‌సెట్-2024 ఫలితాలు విడుదల- ఇంజినీరింగ్ 74.98 శాతం, అగ్రికల్చర్ & ఫార్మసీలో 89.66 శాతం ఉత్తీర్ణత

TS EAPCET 2024: టీఎప్‌ ఎప్‌సెట్-2024 పరీక్ష ఫలితాలు మే 18న విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు జేెెెఎన్‌టీయూహెచ్‌లో అధికారులు ఫలితాలు వెల్లడించారు. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

TS EAPCET Results 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్‌ ఎప్‌సెట్-2024 పరీక్ష ఫలితాలు నేడు (మే 18) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు జేెెెఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత  విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఎప్‌సెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారిక వెబ్‌‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.

ఎప్‌సెట్ ఫలితాలకు సంబంధించి అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు.

TS EAPCET - 2024 (Official) ఫలితాల కోసం క్లిక్ చేయండి..

TS EAMCET Results 2024 (ENG)

TS EAMCET Results 2024 (A & P)

టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రెండురోజుల్లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల తొలిరోజైన జూన్ 7న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్‌కు 90.41 శాతం మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌కు 91.24 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా, 33,500 మందికి గాను 30,288 మంది మొదటి సెషన్‌లో, 33,505 మందికి గాను 30,571 మంది రెండో సెషన్‌లో పరీక్ష రాశారు. ఇక మే 8న నిర్వహించిన పరీక్షకు 91.67% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 33,427 మందికిగాను 30,641 మంది హాజరయ్యారు. 

ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది  మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.  

హైదరాబాద్‌లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే..
ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది.  ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget