అన్వేషించండి

TS EAPCET: టీఎస్ ఎప్‌సెట్-2024 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! రిజల్ట్స్ ఎప్పుడంటే?

Results 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎప్‌సెట్ ఫలితాల వెల్లడికి ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది.

TS EAPCET Results 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం  మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు.. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను ఇప్పటికే విడుదల చేసిన జేఎన్‌టీయూ-హైదరాబాద్ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాల వెల్లడికి ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. మే 25లోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎప్‌సెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్‌ తేదీలను కూడా అధికారులు ప్రకటించనున్నారు. అధికారిక వెబ్‌‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.

టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రెండురోజుల్లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల తొలిరోజైన జూన్ 7న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్‌కు 90.41 శాతం మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌కు 91.24 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా, 33,500 మందికి గాను 30,288 మంది మొదటి సెషన్‌లో, 33,505 మందికి గాను 30,571 మంది రెండో సెషన్‌లో పరీక్ష రాశారు. ఇక మే 8న నిర్వహించిన పరీక్షకు 91.67% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 33,427 మందికిగాను 30,641 మంది హాజరయ్యారు. 

ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది  మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.  

హైదరాబాద్‌లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే..
ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది.  ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

'దోస్త్' షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలు ఇవే
తెలంగాణలోని  ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ-DOST) మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మే 25తో ముగియాల్సిన దరఖాస్తు గడువును మే 29 వరకు అధికారులు పొడిగించారు. ఇక మే 15 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు మే 30 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. 
దోస్త్ పూర్తిస్థాయి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Embed widget