అన్వేషించండి

EAMCET Counselling: ఎంసెట్(బైపీసి) కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 1 నుంచి 3 వరకు స్లాట్‌ బుకింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నవంబర్‌ 3 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.

తెలంగాణలో ఎంసెట్‌ అగ్రికల్చర్, బీఫార్మసీ స్ట్రీమ్ పరీక్ష రాసిన  ఇంటర్ బైపీసీ విద్యార్థులకు బీఫార్మసీలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం (అక్టోబరు 8న) ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 1 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది.

ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 1 నుంచి 3 వరకు స్లాట్‌ బుకింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నవంబర్‌ 3 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు నవంబరు 3 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దిగ్విజయంగా వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ 9న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు నవంబరు 13 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. 


17 నుంచి తుది విడత కౌన్సెలింగ్..
మొదటివిడతలో సీట్లు పొందలేనివారు తుది విడత కౌన్సెలింగ్ ద్వారా సీటు కోసం ప్రయత్నించవచ్చు. నవంబరు 17 నుంచి ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. నవంబరు 17న ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. నవంబరు 18న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు నవంబరు 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.  వీరికి నవంబరు 22న సీట్లను కేటాయించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు నవంబర్‌ 22 నుంచి 25 వరకు నేరుగా కాలేజీలకు వెళ్లి రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. స్పాట్‌ అడ్మిషన్స్‌కు సంబంధించిన వివరాలను నవంబర్‌ 23న వెల్లడించనున్నారు.


మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

నవంబరు 1 నుంచి 3 వరకు స్లాట్‌ బుకింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు. 
నవంబర్‌ 3 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన.
నవంబరు 3 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.
నవంబర్‌ 9న మొదటి విడత సీట్ల కేటాయింపు.
నవంబరు 13 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌. 


తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు..

నవంబరు 17న ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్.
నవంబరు 18న  ధ్రువపత్రాల పరిశీలన.
నవంబరు 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 
నవంబరు 22న సీట్ల కేటాయింపు. 
నవంబర్‌ 22 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్‌.


 అక్టోబరు 11 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్..
ఎంసెట్(ఇంజినీరింగ్) తుది విడత కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు అక్టోబర్ 11,12 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అక్టోబరు 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, ఆ తర్వాత అక్టోబరు 16న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతాయి.

షెడ్యూలు ఇదే..

అక్టోబర్ 11,12న  రెండో విడత స్లాట్ బుకింగ్
అక్టోబర్ 12న  రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబరు 12,13 తేదీల్లో  రెండో విడత వెబ్ ఆప్షన్లు
అక్టోబరు 16న  రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.


Also Read:

జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు. పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం దరఖాస్తు గడువు ముగిసేనాటికి 392 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అక్టోబరు 30 వరకు పొడిగించారు. ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


NMMS: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
Embed widget