అన్వేషించండి

TS PGECET: ఎంటెక్‌, ఎంఫార్మ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి, 2744 సీట్లు భర్తీ!

మొదటి ఫేజ్‌లో 8815 కన్వీనర్‌ కోటా సీట్లలో 4731 మందికి కేటాయించగా అందులో ఇంతవరకు 2872 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించగా 2744 సీట్లు భర్తీ అయ్యాయి.

టీఎస్‌ పీజీఈసెట్‌ రెండో విడత సీట్లను కేటాయించారు. ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌, ఎంఆర్క్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 6248 ఉండగా వీటిలో 2744 సీట్లను కేటాయించారు. మొత్తం 3270 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. వీరిలో 2744 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు పొందారు. సీటు పొందిన విద్యార్థులు ఫీ చలాను తీసి అక్టోబరు 31 నుంచి నవంబర్‌ 3లోపు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై కాలేజీలో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. మొదటి ఫేజ్‌లో 8815 కన్వీనర్‌ కోటా సీట్లలో 4731 మందికి కేటాయించగా అందులో ఇంతవరకు 2872 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. మొదటి విడతలో మిగిలిన 6248 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించగా 2744 సీట్లు భర్తీ అయ్యాయి.

సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి.. 

తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డి, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. పీజీఈసెట్ తొలి విడత సీట్లను అక్టోబరు 14న కేటాయించారు. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో 8,815 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. వీటికి 5,494 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోగా 4,731 మందికి సీట్లు దక్కాయి. ఎంటెక్‌‌లో 2,522 మందికి, ఎంఫార్మసీలో 2,163 మందికి సీట్లు కేటాయించారు. ఇక ఎంఆర్క్‌లో 46 మందికి సీట్లు పొందారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఫీజు చెల్లించి అక్టోబరు 15 నుంచి 19 వరకు కళాశాలలో రిపోర్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 232 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోని 9131 సీట్లు కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తొలుత గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు సీట్లు కేటాయించారు. పీజీఈసెట్‌ పరీక్షలో 11,520 మంది, గేట్‌/జీపీఏటీ పరీక్షలో 411 మంది మొత్తం 11931 మంది అర్హత సాధించారు. 

Also Read:  ఉన్నత విద్య పరీక్ష విధానంలో మార్పు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఎంవోయూ!

 

తెలంగాణ పీజీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ కౌన్సెలింగ్ నోటిఫికేషన్: 16.09.2022 

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల స్కానింగ్: 19.09.2022 to 02.10.2022 

➥ స్లాట్ బుకింగ్ ద్వారా స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ (NCC / CAP / PH / Sports): 22.09.2022 to 24.09.2022 

➥ అభ్యర్థుల వెరిఫికేషన్ లిస్ట్, ఈమెయిల్ ద్వారా సవరణలు: 04.10.2022 

➥ వెబ్‌ఆప్షన్లు (ఫేజ్-1): 07.10.2022 to 09.10.2022 

➥ వెబ్‌ఆప్షన్ల ఎడిట్ (ఫేజ్-1): 10.10.2022 

➥ కాలేజీల వారీగా అభ్యర్థుల ప్రాథమిక జాబితా ప్రకటన (ఫేజ్-1): 12.10.2022 

➥సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు: 12.10.2022 to 15.10.2022 

➥ తరగతుల ప్రారంభం: 17.10.2022.

Also Read: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐటీ బాంబే, ఉద్యోగితలో దేశంలోనే టాప్‌!!
 

తెలంగాణ పీజీఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల స్కానింగ్: 18.10.2022 - 22.10.2022. 

➥ అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటన: 23.10.2022.

➥ వెబ్‌ఆప్షన్లు (ఫేజ్-2): 24.10.2022 - 25.10.2022.

➥ వెబ్‌ఆప్షన్ల ఎడిట్ (ఫేజ్-2): 26.10.2022. 

➥ కాలేజీల వారీగా అభ్యర్థుల ప్రాథమిక జాబితా ప్రకటన (ఫేజ్-1): 30.10.2022.

➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు: 31.10.2022 - 03.11.2022. 

తెలంగాణలో ఎంటెక్‌, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ఆగ‌స్టు 2 నుంచి 5 వరకు నిర్వహించారు. మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఈ ప‌రీక్షల‌ను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 3న విడుద‌ల చేశారు. ఫలితాల్లో మొత్తం 91.48 శాతం మంది అర్హత సాధించారు. 19 విభాగాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 12,592 మంది హాజరుకాగా.. వారిలో 11,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైనవారిలో 6,440 మంది (55.90 శాతం) అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. ఒక్క ఫార్మసీ విభాగంలోనే 5,186 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget