By: ABP Desam | Updated at : 25 Aug 2021 02:25 PM (IST)
TS EAMCET 2021
తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు కొద్ది గంటల క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంసెట్ ఫలితాలను తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లో చూడవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే ఫలితాల విడుదలకు దాదాపు మూడు గంటల ముందు (ఉదయం 9 గంటల నుంచి) నుంచే ఈ వెబ్‌సైట్ పనిచేయడం లేదు.
ఫలితాల కోసం విద్యార్థులంతా ఒక్కసారిగా ఎంసెట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయడంతో భారీగా ట్రాఫిక్ పెరిగింది. దీంతో వెబ్ సైట్ తెరవడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ దర్శనమిస్తోంది. ఫలితాలు విడుదలై మూడు గంటలు దాటుతున్నా ఇంకా మార్కులను తెలుసుకోలేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అధికారులు ఈ సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు. మరికాసేపట్లో వెబ్‌సైట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: TS EAMCET Results: టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇంజనీరింగ్‌లో 82.08 శాతం మంది క్వాలిఫై
విడుదలైన ఫలితాలు..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈరోజు (ఆగస్టు 25) విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 1,47,991 మంది హాజరైతే 1,21,480 మంది అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో 92.48 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షలకు మొత్తం 79009 మంది హాజరవ్వగా 73070 మంది క్వాలిఫై అయ్యారు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 5 ర్యాంకర్లు..
అగ్రికల్చర్ విభాగం టాప్ 5 ర్యాంకర్లు..
Also Read: TS EAMCET Toppers: టీఎస్ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా.. టాప్ 10 ర్యాంకర్ల వివరాలు
Also Read: TS Eamcet counselling: మరో 5 రోజుల్లో టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే..
Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్
AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
NEET PG 2022: నీట్ పీజీ- 2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం
TS SSC Hall Ticket 2022: టెన్త్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - రెండు విధాలుగా పొందవచ్చని తెలుసా ! డైరెక్ట్ లింక్
MI vs SRH: లక్కు హిట్మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు