అన్వేషించండి

TS EAPCET 2024: ఎప్‌సెట్ ఇంజినీరింగ్ తొలిరోజు ప‌రీక్షకు 94.4 శాతం మంది విద్యార్థులు హాజ‌రు

తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబధించిన 'టీఎస్ ఎప్‌సెట్‌' పరీక్షలు మే 9న ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొత్తం 1,01,961 విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 96,228 మంది పరీక్షకు హాజరయ్యారు.

TS EAPCET 2024: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబధించిన 'టీఎస్ ఎప్‌సెట్‌' పరీక్షలు మే 9న ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందునుంచే విద్యార్థులకు పరీక్ష హాల్‌లోకి అనుమతించారు. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 2.93 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 2.05 లక్షల మంది, ఏపీ నుంచి 88 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. ఎప్‌సెట్‌ పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించారు.

టీఎస్ ఎప్‌సెట్ పరీక్షకు మొత్తం 94.4 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షలకు 94.3 శాతం మంది విద్యార్థులు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు నిర్వహించిన రెండో సెషన్ పరీక్షకు 94.4 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

తొలి సెష‌న్‌లో 50,978 మంది ప‌రీక్షకు హాజ‌రుకావాల్సి ఉండ‌గా, 48,076 మంది హాజ‌ర‌య్యారు. రెండో సెష‌న్‌లో 50,983 మంది విద్యార్థులకుగాను 48,152 మంది హాజ‌ర‌య్యారు. రాష్ట్రవ్యాప్తంగా 166 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఎప్‌సెట్ తొలిరోజు పరీక్షకు అత్యధికంగా ఆదిలాబాద్‌లో (99 %) మంది విద్యార్థులు హాజ‌రయ్యారు. ఇక అత్యల్పంగా గుంటూరు (92.4 %) నుంచి హాజ‌ర‌య్యారు. కాగా మే 10, 11 తేదీల్లోనూ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

మే 10,11 తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్య సూచనలు..

➥ ఈసారి పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుచేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు.

➥ పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.  

➥ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు లేదా కాలేజీ ఐడీ కార్డును పరీక్ష రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. 

➥ అభ్యర్థులు హాల్‌‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

➥ పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్‌టికెట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

➥  సెల్‌ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 

➥ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

➥ అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించరు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
Embed widget