అన్వేషించండి

TS DEECET: ఆగస్టు 22 నుంచి డీఈఈసెట్‌ సర్టిఫికేట్ వెరిఫికేషన్!

2022-24 విద్యా సంవ‌త్సరానికి గానూ డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌లో ప్రవేశాల నిమిత్తం.. జులై 23న రాత ప‌రీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న ఫలితాలను వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో డీఈఈసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆగస్టు 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. పూర్వపు జిల్లా కేంద్రాల్లోని డైట్ కళాశాలల్లో పరిశీలన జరుగుతుంది. మొత్తం 6550 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. ఆగస్టు 22న 3391 మంది అభ్యర్థులకు; ఆగస్టు 23న 1509 మంది అభ్యర్థులకు; ఆగస్టు 24న 1117 మంది అభ్యర్థులకు; ఆగస్టు 25న 533 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఒకవేళ ఆగస్టు 25న పూర్తికాని అభ్యర్థులకు ఆగస్టు 26న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.


Notification

Website


2022-24 విద్యా సంవ‌త్సరానికి గానూ డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌లో ప్రవేశాల నిమిత్తం.. జులై 23న రాత ప‌రీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న ఫలితాలను వెల్లడించారు. ఫలితాల్లో తెలుగు మీడియంలో 77.40 శాతం, ఇంగ్లిష్ మీడియంలో 78.81 శాతం, ఉర్దూ మీడియంలో 59.41 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరికి ఆగస్టు 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 

 

టాపర్లు వీరే
తెలుగు మీడియంలో మోర్లె ముర‌ళి అత్యధికంగా 65 మార్కులు సాధించి.. ప్రథ‌మ స్థానంలో నిలిచారు. ఇంగ్లిష్ మీడియంలో మీర్జా మ‌హ్మద్ ఇర్షాద్ బేగ్ 77 మార్కులు సాధించి ప్రథ‌మ స్థానంలో నిలిచారు. ఉర్దూ మీడియంలో ఉమేరా ప్రవీణ్ 78 మార్కులు సాధించి, ప్రథమ‌స్థానంలో నిలిచారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యేవారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు: 

1. DEECET-2022 హాల్‌టికెట్.

2. DEECET-2022 ర్యాంకు కార్డు.

3. పదోతరగతి మార్కుల సర్టిఫికేట్ (మెమో) 

4. ఇంటర్ మార్కుల సర్టిఫికేట్ 

5. ఇంటర్మీడియట్ వరకు చదివిన బోనఫైడ్ సర్టిఫికేట్స్. 

6. కుల ధ్రువీకరణ పత్రం.

7. ఆదాయ ధ్రువీకరణ పత్రం.

8. CAP (ఆర్మీకి చెందినవారి పిల్లలు), దివ్యాంగులు, ఎన్‌సీసీ, స్కౌట్స్ & గైడ్స్, స్పోర్స్స్-గేమ్స్ సర్టిఫికేట్

9. ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమైన ఏ సర్టిఫికేట్ అయిన వెరిఫికేషన్ సెంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

 

Also Read:

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET -2022) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌‌ను అధికారులు విడుదల చేశారు. మొదట ఎంపీసీ స్ట్రీమ్ ప్రవేశాలకు సంబంధించి ఆగ‌స్టు 22 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయకేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌కు 2,82,496 మంది  హాజరుకాగా.., 2,56,983  మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో  89.12 శాతం అర్హత సాధించారు. అదేవిధంగా ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది పరీక్షకు హాజరుకాగా.. 83,411 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 95.06 శాతం అర్హత సాధించారు.
కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


Also Read:

తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు ఇలా..
తెలంగాణ ఎంసెట్ 2022 ఫలితాలు ఆగస్టు 12న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూలును కూడా అధికారులు ప్రకటించారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ సాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 21 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 17న తుది విడత సీట్ల కేటాయింపుతో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది.

తెలంగా ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

☛ ఆగ‌స్టు 21 నుంచి ఆగ‌స్టు 29 వరకు ఆన్‌లైన్‌ స్లాట్ బుకింగ్

☛ ఆగ‌స్టు 23 నుంచి ఆగ‌స్టు 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన

☛ ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు

☛ సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు

☛ సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్

☛ సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్

☛ సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన

☛ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు

☛ అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

☛ అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్

☛ అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన

☛ అక్టోబరు 11 నుంచి అక్టోబరు 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

☛   అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

☛   అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ

TS EAMCET 2022 Result


TS EAMCET 2022 Rank Cards

 

 

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Heavy Rains In Karimnagar And Medak: భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
Kamareddy Real Heroes: ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు
ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు - వీడియో
Hyderabad Rain Alert: హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
TVK president Vijay: విజయ్ దాడి చేశాడని ఫిర్యాదు చేసిన ఫ్యాన్ - కేసు పెట్టిన పోలీసులు
విజయ్ దాడి చేశాడని ఫిర్యాదు చేసిన ఫ్యాన్ - కేసు పెట్టిన పోలీసులు
Advertisement

వీడియోలు

Indian Army Rescue Operation in Punjab | ఉత్తర భారత్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Mohammad Siraj about Bumrah Bowling | బుమ్రా లేనప్పుడే వికెట్స్ తీస్తానంటున్న సిరాజ్
Shubman Gill Injury Before Asia Cup 2025 | గాయంతో బాధపడుతున్న శుబ్మన్ గిల్
Sanju Samson in KCL | KCL లో అదరగొడుతున్న సంజూ శాంసన్
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heavy Rains In Karimnagar And Medak: భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
Kamareddy Real Heroes: ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు
ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు - వీడియో
Hyderabad Rain Alert: హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
TVK president Vijay: విజయ్ దాడి చేశాడని ఫిర్యాదు చేసిన ఫ్యాన్ - కేసు పెట్టిన పోలీసులు
విజయ్ దాడి చేశాడని ఫిర్యాదు చేసిన ఫ్యాన్ - కేసు పెట్టిన పోలీసులు
Priyanka Mohan: 'సువ్వి సువ్వి'తో ప్రియాంక రోల్ ఏమిటో తెలిసిందిగా... 'ఓజీ'లో పవన్ గ్యాంగ్‌స్టర్ అయితే హీరోయిన్?
'సువ్వి సువ్వి'తో ప్రియాంక రోల్ ఏమిటో తెలిసిందిగా... 'ఓజీ'లో పవన్ గ్యాంగ్‌స్టర్ అయితే హీరోయిన్?
Smart TV Mistakes to Avoid : స్మార్ట్ టీవీ విషయంలో ఆ తప్పులు చేయకండి.. త్వరగా పాడైపోద్ది
స్మార్ట్ టీవీ విషయంలో ఆ తప్పులు చేయకండి.. త్వరగా పాడైపోద్ది
Kalyana Lakshmi Scheme: తల్లికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే... అది చూసి అంతా షాక్
తల్లికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే... అది చూసి అంతా షాక్
Asia Cup Records: ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్లు.. టీమిండియానే టాప్
ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్లు.. టీమిండియానే టాప్
Embed widget