అన్వేషించండి

Good Study Habits: చదివింది ఒంటబట్టాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి

Good Study Habits: చదివింది చక్కగా గుర్తుండిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Good Study Habits: కొంత మంది తెగ చదివేస్తుంటారు. ఎప్పుడూ చూసినా పుస్తకం పట్టుకునే కనిపిస్తారు. కానీ అసలు టైమ్ వచ్చే సరికి ఏదీ గుర్తుండదు. పరీక్షల్లో రాసే ముందు ఏదీ గుర్తుకు రాక తలలు పట్టుకుంటారు. చదువు కోసం వెచ్చించిన సమయం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఇంకొంత మంది ఉంటారు.. వాళ్లు ఎప్పుడూ చదివినట్లు అనిపించదు. పుస్తకం పట్టుకున్నట్లు కూడా పెద్దగా కనిపించరు. కానీ పరీక్షల్లో బాగానే రాస్తారు, ఏదైనా అడిగినా సమాధానం చెబుతారు. ఇలా చాలా మందికి అవుతుంది. ఇలా అవడం చాలా మంది గమనించే ఉంటారు కూడా. అయితే దానికి కారణాలు లేకపోలేదు. ఎంత సేపు చదివామన్నది ఎప్పుడూ ముఖ్యం కాదు. ఎంత ఏకాగ్రతతో, నాణ్యంగా చదివామన్నదే ముఖ్యం. కొద్ది సేపు చదివినా పూర్తి ఏకాగ్రతతో, అదే ధ్యాసతో చదివితే చక్కగా గుర్తుండిపోతాయి. అసలు ఎలా చదవాలి, చదివింది కాసేపే అయినా చక్కగా గుర్తుండాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి.

1. వాస్తవ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి

వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి. ఒక్కసారి కూర్చొని చదవడం మొదలు పెడితే అన్ని సబ్జెక్టులు ఒకేసారి పూర్తి చేయాలని అనుకోవద్దు. చదవాల్సిన విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఒక్కో దాన్ని పూర్తి చేస్తూ వెళ్లాలి. 

2. ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి

పడగ్గది, లైబ్రేరీ, స్టడీ రూమ్, టెర్రస్, బాల్కనీ ఇలా ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. అంతరాయం కలిగించని చోట కూర్చొని పూర్తి ఏకాగ్రతతో చదవాలి.

3. బ్రేక్ తీసుకోవాలి

చదువుతుంంటే అదే పనిగా ఎక్కువ సేపు కూర్చోవద్దు. తరచూ బ్రేకులు తీసుకోవాలి. అలా కాసేపు లేచి అటు ఇటు తిరగాలి. అలా చేయడం వల్ల రిఫ్రెష్ గా ఉంటుంది. తిరిగి ఏకాగ్రతగా చదవడానికి వీలవుతుంది.

4. తగినంతగా నిద్ర పోవాలి

బాగా విశ్రాంతి తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. రోజూ 7-8 గంటల పాటు నిద్రపోతే శరీరానికి, మనస్సుకు విశ్రాంతి లభించి తిరిగి శక్తిని పుంజుకుంటుంది. 

5. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి

ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినాలి. దీని వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభించి శరీరం, మనస్సు యాక్టివ్ గా ఉంటాయి. ఫ్రైడ్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్లు, మసాలా ఫుడ్స్ లాంటివి తినడం వల్ల వాటిని జీర్ణం చేసుకోవడానికే శరీరం శక్తిని వెచ్చిస్తుంది.

6. ప్లాన్ చేసుకోవాలి

ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, అసైన్ మెంట్లు ఎప్పుడు పూర్తి చేయాలి లాంటి వాటికి సమయం కేటాయించుకోవాలి. అలాగే ఏది ముఖ్యమో గుర్తించి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.

7. ఇతరులతో కలిసి చదువుకోవాలి

స్నేహితులు, క్లాస్‌మేట్స్, ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకేదైనా డౌట్ వచ్చినా, వారికేదైనా డౌట్ వచ్చినా దాని వల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది. సబ్జెక్ట్ పై చర్చించడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి.

Also Read: Science vs Commerce vs Arts: 10 తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి, ఏ గ్రూపులో చేరితో ఎలాంటి భవిష్యత్ ఉంటుంది?

8. రాయడం ప్రాక్టీస్ చేయాలి

చదివింది పేపర్ పై రాయడం మొదలు పెట్టడం వల్ల ఆ సబ్జెక్టు మీకెంత అర్థం అయింది, ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది, ఏయే అంశాలు గుర్తుండటం లేదో తెలుస్తుంది.

9. సహాయం తీసుకోవాలి

అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి. ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ లేదా లెక్చరర్ల సహాయం తీసుకోవాలి. ఏదైనా అర్థం కాని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి.

10. మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోవాలి

మీరు పెట్టుకున్న లక్ష్యాలను అందుకుంటే మీకు మీరు తప్పకుండా రివార్డ్ ఇచ్చుకోవాలి. వాటి వల్ల మరింత ఉత్సాహం లభిస్తుంది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget