(Source: ECI/ABP News/ABP Majha)
Science vs Commerce vs Arts: 10 తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి, ఏ గ్రూపులో చేరితో ఎలాంటి భవిష్యత్ ఉంటుంది?
Science vs Commerce vs Arts: పదో తరగతి తర్వాత ఏ గ్రూపు తీసుకోవాలని, ఇంటర్ లో ఏ కోర్సు తీసుకోవాలని చాలా మంది విద్యార్థులు తర్జనభర్జన పడుతుంటారు.
Science vs Commerce vs Arts: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల ఎస్ఎస్సీ బోర్డులతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కూడా 10వ తరగతి ఫలితాలు విడుదల చేశాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్‌ఫ్యూజన్.. ఇంటర్ లో ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కోర్సు తీసుకుంటే ఎలాంటి కెరీర్ ఉంటుంది, ఏ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి లాంటి కన్‌ఫ్యూజన్ లో పడిపోతుంటారు చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు. స్నేహితులు, క్లాస్‌మేట్స్, తెలిసిన వారు, చుట్టాలబ్బాయి, పక్కింటి అమ్మాయి ఏం తీసుకున్నారో తెలుసుకుని వారిని అనుకరిస్తూ చాలా మంది తప్పుగా నిర్ణయం తీసేసుకుంటారు. పదో తరగతి తర్వాత ఇంటర్ లో తీసుకునే నిర్ణయమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏ దారిలో వెళ్లాలన్నది ఇక్కడే తేల్చుకోవాలి. కామర్స్, ఆర్ట్స్, సైన్స్ ఏ గ్రూపు తీసుకోవాలి, కెరీర్ లో ఏం కావాలన్నది ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కెరీర్ ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. అందుకే ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. మీ ఆసక్తులు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ లక్ష్యాలు, అన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇందుకోసం నిపుణులు, టీచర్లు, ఇంట్లో ఉన్నత చదువులు చదివిన వారు, చదువు గురించి అన్ని తెలిసిన వారిని అడిగి సరైన సలహాలు, సూచనలు తీసుకుని ముందడుగు వేయాలి.
అన్ని కోణాల్లో ఆలోచించి భవిష్యత్తును బంగారుమయం చేసే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆసక్తుల మేరకు సరైన నిర్ణయం తీసుకుంటే సగం విజయం దక్కినట్లే. పక్కింటి వాళ్లు, స్నేహితులు ఏదో కోర్సు తీసుకున్నారని మనమూ తీసుకుంటే.. తర్వాత ఆ గ్రూపు చదవలేక ఇబ్బంది పడి వేరే గ్రూపు తీసుకోవాలనుకుంటే ఎంతో విలువైన సమయం వృథా అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అన్ని విధాల ఆలోచించి సరైన గ్రూపు, సరైన కోర్సును ఎంచుకోవాలి.
Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?
సైన్స్:
సైన్స్ కోర్సులు ఎంచుకుంటే వివిధ శాస్త్రీయ రంగాల్లో భవిష్యత్తును నిర్మించుకునేందుకు సరైన పునాది ఇంటర్ లో పడుతుంది. వైద్య రంగం, సాంకేతిక రంగం, పరిశోధనలు, ఫార్మసీ, బయోటెక్నాలజీ సహా ఇతర సైన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు. ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్సుల్లో చేరవచ్చు.
కామర్స్:
కామర్స్ రంగంలో అనేక అంశాలు ఉంటాయి. ఫైనాన్స్, అకౌంటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇంటర్‌నేషనల్ బిజినెస్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ లాంటి వాటిలో భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ వంటి కోర్సుల్లో జాయిన్ కావొచ్చు.
ఆర్ట్స్, హ్యూమానిటిస్:
జర్నలిజం, లిటరేచర్, టీచింగ్, సోషల్ వర్క్, లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, క్రియేటివ్ ఆర్ట్స్, మీడియా, అడ్వర్టైజ్‌మెంట్, కల్చరల్ స్టడీస్ లాంటి రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. జర్నలిజం, బీఏ, టీచింగ్ కోర్సుల్లో చేరవచ్చు.
వీటితో పాటు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి తదితర కోర్సులు ఉన్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial