అన్వేషించండి

TS POLYCET - 2024 దరఖాస్తుకు ఏప్రిల్‌ 28తో ముగియనున్న గడువు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?

TS POLYCET - 2024 దరఖాస్తు గడువు ఏప్రిల్ 28తో ముగియనుంది. అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రూ.300 తత్కాల్ ఫీజు కింద మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

POLYCET 2024 Application: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న 'టీఎస్ పాలిసెట్-2024' దరఖాస్తు గడువు ఏప్రిల్ 28తో ముగియనుంది. అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇక ఆ తర్వాత రూ.300 తత్కాల్ ఫీజు కింద మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. పదోతరగతి విద్యార్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 24న టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: polycet-te@telangana.gov.in లేదా 040 -23222192 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 

పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు.

వివరాలు..

* టీఎస్ పాలిసెట్ (TS POLYCET) 2024 నోటిఫికేషన్

అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంపార్ట్‌మెంట‌ల్‌ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పరీక్ష విధానం..
➥ మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో లేదు.

➥ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ALSO READ: తెలంగాణ లాసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

వేర్వేరుగా ర్యాంకుల ప్రకటన..

➥ పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు. 

➥ పాలిటెక్నిక్‌ (టెక్నికల్‌): ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30,కెమిస్ట్రీ–30 గా ఉంటాయి

➥ అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ: అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–(60/2=30)–30, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.

అర్హత మార్కులు..

➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు,

➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.02.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.04.2024.

➥ రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 30.04.2024.

➥ రూ.300 తత్కాల్ ఫీజు కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 20.05.2024.

➥ పాలిసెట్ పరీక్ష తేది: 24.05.2024.

➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 10 రోజుల్లో ఫలితాల వెల్లడి.

Notification

Registration

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Elections 2024: 'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
OTT: ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
Special Buses: హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
Akkineni Cousins : ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Warangal Public Reaction on Voting | ఓటు వేయటం ఎంత అవసరమో వరంగల్ ప్రజల మాటల్లో | ABP DesamCM Revanth Reddy Football in HCU | HCU లో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి | ABP DesamKadapa SP Siddharth Kaushal Mass Warning | EVMలు టచ్ చేయాలని చూస్తే..కడప ఎస్పీ వార్నింగ్ | ABPKarimnagar Youth Voters | ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో చెబుతున్న కరీంనగర్ ఓటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Elections 2024: 'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
OTT: ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
Special Buses: హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
Akkineni Cousins : ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
IPL 2024: చెపాక్‌ వేదికగా సీఎస్కేతో మ్యాచ్, బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
చెపాక్‌ వేదికగా సీఎస్కేతో మ్యాచ్, బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
Visakha News: ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం
ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం
Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా
Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా
Sarkaar 4 Promo: ‘సర్కార్ 4’లో సత్యభామ - కాజల్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సుడిగాలి సుధీర్
‘సర్కార్ 4’లో సత్యభామ - కాజల్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సుడిగాలి సుధీర్
Embed widget