అన్వేషించండి

TGSET 2024 Schedule: టీజీసెట్-2024 పరీక్షల షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలివే

TS SET: తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టుల అర్హత నిర్వహించే టీఎస్‌ సెట్ – 2024కు పరీక్ష తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ మార్పులు చేసింది.

TGSET 2024 Exam Revised Schedule: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(TGSET) 2024 పరీక్షల తేదీలను అధికారులు రీషెడ్యూలు చేశారు. ఆగస్టు 28 నుంచి పరీక్షలు ప్రారంభంకావాల్సి ఉండగా.. సెప్టెంబరు 10 నుంచి నిర్వహించనున్నట్లు టీఎస్‌సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఆగస్టు1న ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబరు 10, 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. యూజీసీ నెట్ పరీక్షల నేపథ్యంలో సెట్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు. సెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.    

దరఖాస్తుకు ఆగస్టు 6 వరకు అవకాశం..
టీజీసెట్ దరఖాస్తు గడువు ఇప్పటికే ముగియగా.. ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు రూ.3000 ఆలస్య రుసుముతో ఆగస్టు 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తుల సవరణకు తొలుత ఆగస్టు 8, 9 తేదీల్లో అవకాశం ఉండగా.. దాన్ని ఆగస్టు 28, 24 తేదీలకు మార్చారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబరు 2 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET - 2024) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం మే 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభంకాగా.. ఆగస్టు 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

TGSET 2024 Schedule: టీజీసెట్-2024 పరీక్షల షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలివే

వివరాలు..

➥ తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష - టీెఎస్‌ సెట్ (TS SET)-2024

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పరీక్ష ఫీజు: పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.

పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు టీఎస్ సెట్ 2024 పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి.

TS SET 2024 Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget