అన్వేషించండి

TG POLYCET Counselling: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూలు వెల్లడి - రిజిస్ట్రేషన్, సీట్ల కేటాయింపు వివరాలు ఇలా

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును సాంకేతిక విద్యాశాఖ మే 24న వెల్లడించింది. జూన్ 20 నుంచి  కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది.

TS POLYCET 2024 Counselling Schedule: తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును సాంకేతిక విద్యాశాఖ మే 24న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 20న  కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది.  పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 20 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు జూన్ 22 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్నవారు జూన్ 22 నుంచి 27 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తిచేసివారికి జూన్ 30లోపు మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జూన్ 30 నుంచి జులై 4 మధ్య సంబంధిత కళాశాలల్లో నిర్ణీత ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇక జులై 7 నుంచి 16 మధ్య రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వెబ్ఆప్షన్ల నమోదుకు జులై 9 నుంచి అవకాశం కల్పించనున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 16లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్‌ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించనున్నారు. జులై 24లోపు సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.  

పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం: 20.06.2024.

➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 22.06.2024 - 25.06.2024 వరకు.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 22.06.2024 - 27.06.2024 వరకు.

➥ పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు: 30.06.2024 లోపు.

➥ సెల్ఫ్ రిపోర్టింగ్: 30.06.2024 నుంచి 04.06.2024 మధ్య.

పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం: 07.07.2024.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 09.07.2024 నుంచి.

➥ పాలిసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు: 13.07.2024.

➥ ఇంటర్నల్ స్లైడింగ్‌: 21.07.2024.

పాలిసెట్ పరీక్షకు 89.23 శాతం హాజరు..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 24న ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 259 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 92,808 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో 82,809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాది 1.05 లక్షల మంది విద్యార్థులు పోటీపడగా.. ఈ సారి 92 వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 

పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు.

పాలిసెట్ ర్యాంకుల ప్రకటన ఇలా..

➥ తెలంగాణలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను కేటాయిస్తారు. ఇందులో టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందిస్తారు. ఆతర్వాత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 

➥ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారికి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్–60 మార్కులు, ఫిజిక్స్‌–30 మార్కులు, కెమిస్ట్రీ–30 మార్కులు ఉంటాయి.

➥ ఇక అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్–(60/2=30)–30, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget