అన్వేషించండి

TG ICET 2024 Answer Key: తెలంగాణ ఐసెట్-2024 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - 'కీ'పై అభ్యంతరాలకు అవకాశం

ICET 2024 Answer Key: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్ పరీక్ష ప్రాథ‌మిక కీని జూన్ 8న విడుద‌ల చేశారు. ఆన్సర్ కీపై జూన 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

Telangana ICET 2024 Preliminary Anser Key: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంబంధించిన ప్రాథ‌మిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ జూన్ 8న విడుద‌ల చేశారు. ఆన్సర్ కీతోపాటు పరీక్ష ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రెస్పాన్స్ షీట్లను పొందడానికి అభ్యర్థుల తమ ఐసెటట్ రిజిస్ట్రేషన్ నెమరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి డౌన‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యంతరాలు నమోదుచేసేందుకు ఐసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. ప్రాథ‌మిక కీపై జూన్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంత‌రాల‌ను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు.  

Question Papers  |  Download Response Sheets  |  Key Objections

జూన్, 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్ష కేంద్రాల్లో 86,156 మంది విద్యార్థులకుగాను 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 90.47 శాతం హాజరు నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో జూన్ 5న మొదటి సెషన్‌కు 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక జూన్‌ 6న ఉదయం జరిగిన చివరి సెషన్‌లో 28,256 మంది విద్యార్థులకుగాను 25,662 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్ పరీక్ష కోసం ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో ఈసారి దరఖాస్తులు రావడం విశేషం. ఐసెట్ పరీక్ష కోసం మొత్తం 84,750 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా.. ఈసారి 9,230 దరఖాస్తులు అధికంగా వచ్చిన సంగతి తెలిసిందే. 

ఐసెట్ పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణలో 16, ఏపీలో 4 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి.. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించారు.

పరీక్ష ఇలా జరిగింది..
➥ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 5, 6  తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్-2024 పరీక్ష నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. జూన్ 5న ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించారు.

➥ మొత్తం 200 మార్కులకు తెలంగాణ ఐసెట్ - 2024 ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.

అర్హత మార్కులు..
ఐసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 200 మార్కులకుగాను 50 మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Embed widget