TS ICET Results: ఐసెట్ ఫలితాల్లో 89.58 శాతం ఉత్తీర్ణత, టాప్-20 ర్యాంకర్లు వీరే!
ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షకు 75,954 మంది పరీక్షకు హాజరవగా.. 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఐసెట్ ప్రవేశ పరీక్షలు 89.58 శాతం ఉత్తీర్ణత సాధించారు.
టీఎస్ ఐసెట్ -2022 ఫలితాలు విడుదలయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల నిమిత్తం జూలై 27, 28వ తేదీల్లో నిర్వహిచిన టీఎస్ ఐసెట్ -2022 ఫలితాలను ఐసెట్ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రమేశ్ ఆగస్టు 27న కామర్స్ కళాశాల సెమినార్‌హాల్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షకు 75,954 మంది పరీక్షకు హాజరవగా.. 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఐసెట్ ప్రవేశ పరీక్షలు 89.58 శాతం ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ ఐసెట్ ర్యాంకు కార్డులు (TS ICET 2022 Rank Cards).. Download
TS ICET 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
టాప్ 20 ర్యాంకర్లు వీరే..
1వ ర్యాంక్ – దంతాల పూజిత్‌వర్ధన్, (గోరంట్ల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్)
2వ ర్యాంక్ – అంబవరం ఉమేశ్ చంద్రరెడ్డి (ముతరాసపల్లి, కడప, ఆంధ్రప్రదేశ్)
3వ ర్యాంక్ – కాట్రగడ్డ జితిన్‌సాయి (రేపల్లె, గుంటూరు)
4వ ర్యాంక్ – ఎలిశాల కార్తీక్ (కేసముద్రం, మహబూబాబాద్, తెలంగాణ)
5వ ర్యాంక్ – ధర్మాజీ సతీశ్‌కుమారు, హజిపూర్, మంచిర్యాల, తెలంగాణ)
6వ ర్యాంక్ – మైలవరపు అభినవ్ (బొందలగడ్డ, హైదరాబాద్)
7వ ర్యాంక్ – నవనీస కంపరాజు (కాచిగూడ, హైదరాబాద్)
8వ ర్యాంక్ – ఎజ్జగిరి హరిప్రసాద్ (శివనగర్, వరంగల్)
9వ ర్యాంక్ – నారాల మనీషారెడ్డి (కామారెడ్డి)
10వ ర్యాంక్ – తిరువీది సువర్ణ సాత్విక( జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రదేశ్)
11వ ర్యాంక్ – మారం శివప్రసాద్ (నారెట్‌పల్లి, నల్గొండ)
12వ ర్యాంక్ – నంగు గంగోత్రి (సీతాఫల్‌మండి, సికింద్రాబాద్)
13వ ర్యాంక్ – గంగిడి మేఘనారెడ్డి (చికడపల్లి, హైదరాబాద్)
14వ ర్యాంక్ – అలోనీ నీరజ్ (ఉప్పల్, హైదరాబాద్)
15వ ర్యాంక్ – ఇరువంటి సంతోష్‌కుమార్ (సూర్యాపేట)
16వ ర్యాంక్ – మున్ననురు చింటు (రాజవరం, నల్గొండ)
17వ ర్యాంక్ – పాలంకి కృష్ణసిద్దార్థ (బొబ్బిలి, విజయనగరం)
18వ ర్యాంక్ – నిధిసింగ్లా (గచ్చిబౌలి, హైదరాబాద్)
19వ ర్యాంక్ – కుప్పా ఆదిత్య (మలాజిగిరి)
20వ ర్యాంక్ – బొమ్మి వెంకటవిజ్జి భరద్వాజ్ (బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్).
ఈ ఏడాది పరీక్ష జులై 27, 28 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లలో ఐసెట్-2022 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 4 మొత్తంగా 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 75 మంది అబ్జర్వర్లను నియమించి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించింది.
ఈ పరీక్ష రాసేందుకు తెలంగాణ, ఏపీల్లో కలిపి 90.56 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కోసం 75,952 మంది దరఖాస్తు చేసుకోగా 68,781 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7,171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఆగస్టు 4న విడుదల చేశారు. ఆన్సర్ కీపై ఆగస్టు 8 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఆగస్టు 27న ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారు చేశారు.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET – 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ఏప్రిల్6 నుంచి ప్రారంభించారు. జులై 18 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జులై 27, 28 తేదీల్లో పరీక్ష నిర్వహించారు.
ICET - ఈ కోర్సులతో ఉత్తమ భవిత:
ఎంసీఏ:
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఎంసీఏ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందుకు మ్యాథ్స్ పై పట్టు ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగాన్నే ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దానిపై అవగాహన అధ్యయనం చేయగలగాలి.
ప్రస్తుతం మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ప్రధానంగా ఉపాధి కల్పించేది సాఫ్ట్ వేర్ రంగమే. ఈ కోర్స్ లో చేరినప్పటి నుంచే ప్రోగ్రామింగ్, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఈ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.
జాబ్ మార్కెట్లో బీటెక్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కావల్సిన నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల ముందు వరుసలో నిలుస్తాయి. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్ ప్రోగ్రామింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం అవసరం. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైతే మంచి జీతంతో పాటు చక్కటి కెరీర్ను పొందవచ్చు.
ఎంబీఏ:
నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సుల్లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) మొదటి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ రంగంలోని కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఇందులో త్వరగా రాణిస్తారు. బిజినెస్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్, టీమ్ లీడింగ్ సామర్థ్యం, ప్రణాళిక, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం, బృందా పనితీరును మెరుగు పరిచే ఎలా తీర్చిదిద్దడం, సమస్యలు వచ్చినప్పుడు కారణాలు అన్వేషించి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన వారు బిజినెస్ మేనేజర్లు, సీఈఓ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా మారవచ్చు.
ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్ ,ఫైనాన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు రాణించాలంటే కేస్ స్టడీలను పరిశీలించాలి. అంతేకాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ భాషపై పట్టు మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ప్రత్యేక ప్రావీణ్యం సంతరించుకోవడంతో పాటు, ప్రాజెక్ట్‌వర్క్ చేయాలి. కార్పొరేట్ రంగంలో ఎందుకు వ్యక్తిగత చొరవ కూడా ఉండాలి.
ప్రతి సంవత్సరం ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. ఎందుకంటే దీని సరిపడా నైపుణ్యాలు కొంతమంది లోనే ఉంటున్నాయి. కాబట్టి అలా నేర్చుకునే వారికి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అలా నేర్చుకున్నవారికి బ్యాంకింగ్, ఫార్మ్, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ ,హెల్త్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలు లభిస్తాయి.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..