News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

No Bag Day: విద్యార్థులకు నాలుగో శనివారం 'నో బ్యాగ్' డే! త్వరలో మార్గదర్శకాలు జారీ!

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని 'నో బ్యాగ్‌ డే'గా పాటించాలని నిర్ణయించింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని 'నో బ్యాగ్‌ డే'గా పాటించాలని నిర్ణయించింది. విద్యార్థులు ఆరోజు బ్యాగ్ లేకుండానే స్కూల్‌కు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జూన్ 6న‌ జారీ చేశారు. దీంతో ఏడాదిలో మొత్తం 10 రోజుల పాటు పిల్లలు స్కూల్ బ్యాగులు లేకుండానే బడికి వెళ్లనున్నారు. ఆరోజు వారితో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

గతేడాది పాఠశాలలు తెరిచిన 16 రోజుల తరువాత క్యాలెండర్‌ విడుదల చేయగా.. ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి వారం రోజులు ముందుగానే విడుదల చేయడం విశేషం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరం మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. జూన్‌ 12న ప్రారంభమయ్యే పాఠశాలలు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23తో ముగియనున్నాయి. 

నెల పనిదినాలు
జూన్ 16 
జులై 23
ఆగస్లు 25
సెప్టెంబరు 22
అక్టోబరు 14
నవంబరు 24
డిసెంబరు 23
జనవరి 20
ఫిబ్రవరి 24
మార్చి 23
ఏప్రిల్ 15
మొత్తం పనిదినాలు 229

ఆటలు, యోగా, రీడింగ్ తప్పనిసరి..
టీవీ పాఠాలు యథావిధిగా ప్రసారం చేయనున్నారు. కార్యక్రమాల టైమ్ టేబుల్‌ను వెబ్‌సైట్ డైరెక్టర్ ప్రకటిస్తారు. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు విద్యార్థులో పుస్తకాలు చదివించాలి. అవి పాఠ్య, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజీన్లు తదితరాలు కావొచ్చు. రోజూ స్కూల్‌ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో అయిదు నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆదేశించారు. వారానికి 3- 5 పీరియడ్లు ఆటలకు కేటాయించాలి. ప్రతి నెల మూడో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.

ఈసారి సెలవులు ఇలా.. 

➥ దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా ఈసారి 13 రోజులే ఇచ్చారు. దసరా సెలవులు అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇచ్చారు. 

➥ క్రిస్మస్‌ సెలవులు కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించడం గమనార్హం. డిసెంబరు 22 నుంచి 26 వరకు క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. 

➥ ఇక సంక్రాంతికి మాత్రం గత విద్యాసంవత్సరం 5 రోజులు సెలవులు ఇవ్వగా.. ఈసారి 6 రోజులు ఇవ్వనున్నారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. 

➥ ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. గత విద్యాసంవత్సరంలో 48 రోజుల వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అకడమిక్ క్యాలెండర్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్‌ 15, తెలంగాణ విద్యార్థులు జూన్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌‌లు అందచేస్తారు. 
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 07 Jun 2023 07:07 PM (IST) Tags: Education News in Telugu TS School Academic Calendar 2023 TS Schools New Academic Calendar 2023-24 Exam Dates No bag Day TS Schools No Bag Day

ఇవి కూడా చూడండి

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది