TS LAWCET Counselling: తెలంగాణ లాసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
Telangana Law CET Counselling: తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్/పీజీఎల్‌సెట్-2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది.
Telangana LawCET Counselling Dates: తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్/పీజీఎల్‌సెట్-2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి నవంబరు 9న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 14 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ మేరకు నవంబర్ 9న రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి నేతృత్వంలో జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు. లాసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 11న విడుదల చేయనున్నారు.
తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ నవంబర్ 14 - 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్.
➥ నవంబరు 23, 24 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు.
➥ నవంబరు 28న సీట్ల కేటాయింపు.
➥ నవంబరు 29 నుంచి డిసెంబరు 2 వరకు ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన.
➥ డిసెంబరు 4న తరగతులు ప్రారంభం.
సీట్ల వివరాలు ఇలా..
➥ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 20,234 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 22 కళాశాలల్లో మొత్తం 4,790 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
➥ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 6,039 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 19 కళాశాలల్లో మొత్తం 2,280 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
➥ ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో మొత్తం 2,776 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 17 కళాశాలల్లో మొత్తం 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష మే 25న మూడు సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి సెషన్‌ను ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు నిర్వహించారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు మూడో సెషన్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. పరీక్షల ఆన్సర్ కీని మే 29న ఆన్సర్ కీని విడుదల చేశారు. ఆన్సర్ కీపై మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. లాసెట్ ర్యాంకుల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. మొదటి, రెండో సెషన్లకు తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో సెషన్‌కు తెలంగాణలో 41, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సులకు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజరయ్యారు కానున్నారు. పరీక్షకు హాజరైనవారిలో లాసెట్ (మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం, లాసెట్ (ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాతం, పీజీ ఎల్‌సెట్(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ALSO READ:
తెలంగాణ 'హార్టిసెట్-2023' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా(పాలిటెక్నిక్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ ఆనర్స్ (హార్టికల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు నవంబరు 28లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు పరిశీలన తర్వాత, ప్రవేశపరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది. అర్హులైన అభ్యర్థుల జాబితాను హాల్‌టికెట్ నెంబరుతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అర్హులైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్‌టికెట్ మీద ఫొటోగ్రాఫ్ అతికించి, పరీక్ష రోజు హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. నిర్ణీత గడువులోగా అడ్మిట్‌కార్డులు పొందలేనివారు పరీక్షరోజు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను సంప్రదించి డూప్లికేట్ హాల్‌టికెట్ పొందవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దరఖాస్తుకు అవకాశం ఉండదు.
నోటిఫికేషన్, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..