అన్వేషించండి

TS Inter Exams: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

TS Inter Exams: తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఇందులో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్‌ & హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ థియరీ పరీక్షకు 80 మార్కులకు ఉండనుండగా.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు ఉండనున్నాయి,

ఇంటర్ పరీక్షల షెడ్యూలు..

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు..

➥ 28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I

➥ 01-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-I

➥ 04-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I

➥ 06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I

➥ 11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I

➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I

➥ 15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I

➥ 18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండ్‌ పరీక్షలు..

➥ 29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II

➥ 02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II

➥ 05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II

➥ 07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II

➥ 12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II

➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II

➥ 16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II

➥ 19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II  

ప్రాక్టికల్స్‌ కోసం ప్రత్యేక బుక్..
ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ కోసం ప్రత్యేకంగా 90 పేజీలతో కూడిన ‘ఏ హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌-1’ పేరిట ప్రత్యేక సిలబస్‌తో ఇంటర్మీడియట్‌ బోర్డు కొత్త పుస్తకాన్ని రూపొందించింది. ఆ పుస్తకాలు ముద్రణను పూర్తిచేసుకొని జూనియర్‌ కళాశాలలకు చేరాయి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌ సెకండియర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు, వొకేషనల్‌ కోర్సులకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించి, ఆ సిలబస్‌కు అనుగుణంగా విద్యాసంవత్సరం పొడవునా విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ను చేయించడం అన్నది ఈ కొత్త విధానంలో ప్రధానాంశం.

ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌ అమలుచేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్‌ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్‌ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Embed widget