అన్వేషించండి

Telangana Inter Supplementary Results: జూన్ 24 తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి

TGBIE Inter Supply Results:: తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 24 వెలువడనున్నాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

TG Inter Supplementary Results: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 24న వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డు జూన్ 24న మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 4.5 లక్షల మంది హాజరైనల్లు తెలుస్తోంది. ఇందులో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతోపాటు, ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://tsbie.cgg.gov.in/  

➥ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ అక్కడ వచ్చే పేజీలో విద్యార్థులు తమ  హాల్‌టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.

➥ వివరాలు నమోదుచేయగానే విద్యార్థి మార్కుల వివరాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

➥ విద్యార్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సప్లిమెంటరీ ఫలితాల కోసం వెబ్‌సైట్.. 

గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విద్యార్థుల మార్కుల డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఫలితాలను అప్‌లోడ్ చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు క్షుణ్నంగా పరిశీలించారు.  

ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మరోవైపు దోస్త్ రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎప్‌సెట్ అర్హత ఉంటే.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత పొందుతారు. ఎప్‌సెట్ అర్హత లేనవారు దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. 

తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4.78 లక్షల మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు, 4.43 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఏప్రిల్ 24న ఒకేసారి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం పాసయ్యారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఒకేసారి వెల్లడించనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Embed widget