By: ABP Desam | Updated at : 08 May 2023 10:27 PM (IST)
Edited By: omeprakash
తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్ పరీక్షల ఫలితాలు మే 9న (మంగళవారం) వెల్లడికానున్నాయి. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు telugu.abplive.com, https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్లలో తమ మార్కుల వివరాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ పరీక్షలకు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Also Read:
తెలంగాణ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2023-24) క్యాలెండర్ ..
➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023.
➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.
➥ దసరా సెలవులు: 19.10.2023 - 25.10.2023.
➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.
➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 20.11.2023 - 25.11.2023.
➥ సంక్రాంతి సెలవులు: 13.01.2024 - 16.01.2024.
➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.
➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 - 29.01.2024.
➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.
➥ ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.
➥ వేసవి సెలవులు: 01.04.2024 - 31.05.2024.
➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2024 మే చివరి వారంలో
➥ 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.
జూన్ 11న 'మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష, దరఖాస్తు తేదీలివే?
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభంకానుంది. మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థుల జాబితాను జూన్ 16న, సీట్లు పొందినవారి జాబితాను 18న ప్రకటించనున్నారు. జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 21 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!
APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం