Telangana Inter Results 2023 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల- త్వరగా రిజల్ట్స్ రావాలంటే ఏబీపీ దేశం లింక్ క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

Background
Telangana Inter News: తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడికి సమయం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 9న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 9న ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం telugu.abplive.com tsbie.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
Also Read: జూన్ 11న 'మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష, దరఖాస్తు తేదీలివే?
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభంకానుంది. మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థుల జాబితాను జూన్ 16న, సీట్లు పొందినవారి జాబితాను 18న ప్రకటించనున్నారు. జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 21 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
TS పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికే టాప్
ఇవాళ ఫస్ట్ ఇయర్ 4,33.82 మందికి 2.72,208 పాస్
ఏ గ్రేడ్ 1,60 వేల మంది
బి గ్రేడ్ 68వేల 330 మంది పాస్
బాలికలు -2,17454 మందికి లక్షా 1,49729 మంది పాస్
విద్యార్థి దశకు ఇది టర్నింగ్ పాయింట్: సబితా
మార్చి 15 నుంచి పరీక్షలు జరిగాయి; సబితా
విద్యార్థి దశలో ఇది టర్నింగ్ పాయింట్:; సబితా
1473 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి; సబితా
15 స్పాట్ వాల్యూయేషన్ సెంటర్స్ ఏర్పాటు; సబితా





















