Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూల్ ఇదీ, ఎప్పటినుంచంటే
Telangana Inter Board: జేఈఈ మెయిన్ ఎంట్రేన్స్ పరీక్షలు కూడా ఒకే సమయంలో రావడంతో తెలంగాణ ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు.
Telangana Inter New Time Table: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు (Telangana Inter Exams) సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల అయింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 24 వరకూ ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జేఈఈ మెయిన్ ఎంట్రేన్స్ (JEE Main Exams) పరీక్షలు అదే సమయంలో రావడంతో వీటిని రీషెడ్యూల్ చేశారు. ఇదే క్రమంలో పదో తరగతి పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం కనిపిస్తోంది.
మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం (Inter First Year Exams) పరీక్షలు జరగనుండగా.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు (Inter Second Year Exams) జరుగుతాయి. పర్యావరణ పరీక్షను ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రయోగ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహిస్తారు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ జరగనున్నాయి.
Telangana Inter First Year: ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ)
* మే 6 - పార్ట్ - 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్ - 1)
* మే 9 - పార్ట్ - 1 (ఇంగ్లీష్)
* మే 11 - పార్ట్ - 3 (మ్యాథమెటిక్స్ 1A, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్ -1)
* మే 13 - మ్యాథమెటిక్స్ 1B, జువాలజీ పేపర్ - 1, హిస్టరీ పేపర్ - 1
* మే 16 - ఫిజిక్స్ పేపర్ - 1, ఎకనామిక్స్ పేపర్ - 1
* మే 18 - రసాయ శాస్త్రం పేపర్ - 1, కామర్స్ పేపర్ - 1
* మే 20 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - 1, బ్రిడ్జ్ కోర్స్ మాథ్స్ పేపర్ - 1
* మే 23 - మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్ - 1, జియోగ్రఫీ పేపర్ - 1
Telangana Inter Second Year: సెకండ్ ఇయర్ టైం టేబుల్ (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ)
* మే 7 - పార్ట్ - 2 (సెకండ్ లాంగ్వేజ్ - 2)
* మే 10 - పార్ట్ - 1 (ఇంగ్లీష్ పేపర్- 2)
* మే 12 - పార్ట్ - 3 (మ్యాథమెటిక్స్ 2A, బోటనీ పేపర్ - 2, పొలిటికల్ సైన్స్ పేపర్ - 2)
* మే 14 - మ్యాథమెటిక్స్ 2B, జువాలజీ పేపర్ - 2, హిస్టరీ పేపర్ - 2
* మే 17 - ఫిజిక్స్ పేపర్ - 2, ఎకనామిక్స్ పేపర్ - 2
* మే 19 - రసాయ శాస్త్రం పేపర్ -2, కామర్స్ పేపర్ - 2
* మే 21 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - 2, బ్రిడ్జ్ కోర్స్ మాథ్స్ పేపర్ - 2
* మే 24 - మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్ - 2, జియోగ్రఫీ పేపర్ - 2