అన్వేషించండి

ఇంటర్ ఫస్టియర్ మార్కులే సెకండియర్‌కు.. ప్రాక్టికల్స్‌కు 100 శాతం మార్కులు

Inter Second Year results: ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలనే విషయంపై తెలంగాణ విద్యా శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఫస్టియర్ మార్కులే సెకండియర్‌కు వేయాలని నిర్ణయించింది.

ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ విద్యా శాఖ జారీచేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులనే సెకండియర్‌కు కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు (100 శాతం) ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులకు 35 శాతం మార్కులతో పాస్ చేయనున్నట్లు తెలిపింది. 

కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఇస్తారనే అంశంపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను గ్రేడుల విధానంతో నేరుగా సెకండియర్‌లోకి ప్రమోట్ చేయగా.. సెకండియర్ విద్యార్థుల ఫలితాలను ఇంకా వెల్లడించలేదు. తాజాగా సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర విద్యా శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. 

మార్గదర్శకాలు ఇవీ.. 
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో అవే మార్కులను సెకండియర్‌కి పరిగణలోకి తీసుకుంటామని విద్యా శాఖ పేర్కొంది. అంటే అంటే ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని మార్కులు అయితే వచ్చాయో వాటినే సెకండియర్‌కి కూడా వేస్తారు. ప్రాక్టికల్స్ విషయంలోనూ విద్యా శాఖ పలు విధివిధానాలను రూపొందించింది. ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు (100 శాతం) ఇవ్వాలని నిర్ణయించింది. 

ఫస్ట్ ఇయర్‌లో ఏమైనా సబ్జెక్టులు ఫెయిలైన వారిని కూడా 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని విద్యా శాఖ వెల్లడించింది. సాధారణంగా  ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన వారు సెకండియర్ సాధారణ పరీక్షలతో పాటు వీటిని రాస్తారు. కానీ సెకండియర్ పరీక్షలు కూడా రద్దు కావడంతో వీరిని పాస్ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తామని విద్యా శాఖ పేర్కొంది.

నచ్చకపోతే పరీక్షలు రాసుకోవచ్చు..
సెకండియర్ మార్కుల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలు నచ్చకపోతే విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కూడా కల్పిస్తామని విద్యా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా పరిస్థితులు అంతా సర్దుకున్నాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అప్పుడు విద్యార్థులు పరీక్ష రాసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. 

సెకండియర్ ఫలితాలు 
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 28న (సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేయనునున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. . ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కాగా, తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,73,967 మంది ఫీజులు చెల్లించారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 4,28,986 మంది కాగా ఒకేషనల్‌ విద్యార్థులు 44,981 మంది ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
AP ICET 2026 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Best Country For MBBS : విదేశాల్లో MBBS చేయాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవడానికి ఏ దేశం బెస్ట్?
విదేశాల్లో MBBS చేయాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవడానికి ఏ దేశం బెస్ట్?
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Kidney Damage Symptoms : కిడ్నీలు దెబ్బతింటే.. ఉదయాన్నే కనిపించే సంకేతాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
కిడ్నీలు దెబ్బతింటే.. ఉదయాన్నే కనిపించే సంకేతాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Embed widget