By: ABP Desam | Updated at : 28 Mar 2022 03:12 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్
TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ 2022 అధికారిక నోటిఫికేషన్(Notification) సోమవారం విడుదల అయింది. ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత(Intermediate) సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంది. ఎంసెట్(EAMCET) పరీక్షను జేఎన్‌టీయూ, హైదరాబాద్ నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోలజీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షనల్, ఒకేషనల్ కోర్సుల పాస్ అయి లేదా డిప్లొమా చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
పరీక్షల తేదీలివే?
ఎంసెట్ అగ్రికల్చర్(Agriculture), మెడికల్(Medical) పరీక్షను జూన్ 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షను జూన్ 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెంట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్లు రూ. 400, మిగతా కేటగిరీల అభ్యర్థులు రూ. 800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్ కు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్(SC, ST, PH) అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు విధానం(Application Process) గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/ ను సందర్శించవచ్చు.
ఇంటర్ మార్కుల వెయిటేజ్
45 రోజుల వ్యవధి ఆనవాయితీ
మే 6వ తేదీ నుంచి మే 24 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో సెకండియర్ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు మే 24తో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు 45 రోజుల వ్యవధి ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉన్నందున ఎంసెట్‌ను జూలై 14 నుంచి నిర్వహిస్తున్నారు.
Bill Gates Resume: బిల్గేట్స్ రెజ్యూమ్ చూశారా- ఆయన చేసిన కోర్సులు చూస్తే షాక్ అవుతారు
Paramedical Course after 10th: టెన్త్ తరవాత ఈ కోర్స్ చేస్తే, విదేశాల్లో కొలువు సంపాదించొచ్చు
ITI Course after 10th: టెన్త్ తరవాత ఐటీఐ కోర్స్ చేస్తే, ఈ కేంద్ర సంస్థల్లో జాబ్స్ కొట్టేయొచ్చు
Diploma Course after 10th: టెన్త్ తరవాత డిప్లొమా కోర్స్ చేయొచ్చా, అవకాశాలు ఎలా ఉంటాయ్?
TS SSC Supplementary Exams Date: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు డేట్ ఫిక్స్, ఈ తేదీ నుంచే - మంత్రి వెల్లడి
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోనే ట్రైన్ దిగిపోయిన ఎంపీ
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
IND Vs ENG 5th Test Highlights: మరొక్క సెషన్ నిలబడితే మ్యాచ్ మనదే - ఫాంలోకి వచ్చిన పుజారా!
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు