SKLTSHU: ములుగు హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా
సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యాసంవత్సరానికి హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యరుసుముతో నవంబరు 22 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించారు.
వివరాలు..
➥ ఎంఎస్సీ (హార్టికల్చర్): 32 సీట్లు
స్పెషలైజేషన్లు - సీట్లు: ఫ్రూట్ సైన్స్ - 08, వెజిటబుల్ సైన్స్ - 11, ఫ్లోరికల్చర్ & ల్యాండ్‌స్కేపింగ్ - 08, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ & ఆరోమాటిక్ క్రాప్స్ - 03. ప్రభుత్వ సంస్థలు/ సర్వీసులో ఉన్న అభ్యర్థులకు 2 సీట్లు కేటాయించారు.
అర్హత: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
➥ పీహెచ్‌డీ (హార్టికల్చర్): 08 సీట్లు
స్పెషలైజేషన్లు - సీట్లు: ఫ్రూట్ సైన్స్ - 02, వెజిటబుల్ సైన్స్ - 02, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ - 01, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ & ఆరోమాటిక్ క్రాప్స్ - 01. ప్రభుత్వ సంస్థలు/ సర్వీసులో ఉన్న అభ్యర్థులకు 2 సీట్లు కేటాయించారు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
అప్లికేషన్ ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 'The Comptroller, Sri Konda Laxman Telangana State Horticultural University, payable at Mulugu (V&M), Siddipet District' పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటుకేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023.
➥ రూ.20 00 (రూ.1500 ఎస్సీ, ఎస్టీ, పీహెచ్) ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 22.11.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar,
Administrative Office,
SKLTSHU, Mulugu,
Siddipet Dist. 502 279.
దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన పత్రాలు..
➥ ఈఅడ్మిట్ కార్డు ఏఐసీఈ-జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2023
➥ ఐసీఏఆర్-2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కులు/ర్యాంకు వివరాలు
➥ పీజీ మార్కుల మెమో/కన్సాలిడేట్ సర్టిఫికేట్
➥ క్వాలిఫైయింగ్ పరీక్ష ప్రొవిజినల్/డిగ్రీ సర్టిఫికేట్
➥ 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్లు
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్/ పదోతరగతి సర్టిఫికేట్
➥ దివ్యాంగులకు అవసరమైన సర్టిఫికేట్
➥ రెసిడెన్షియల్ సర్టిఫికేట్
➥ కండక్ట్ సర్టిఫికేట్ (చివరగా చదివిన విద్యాసంస్థ నుంచి)
➥ ఆధార్ కార్డు
➥ అభ్యర్థులు ప్రవేశ సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలన్నీ కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.