Skill Development Training: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగం పొందే ఛాన్స్
Free Training: తెలంగాణలోని బీసీ నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణకు బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీలో శిక్షణతోపాటు, ఉద్యోగావకాశాలుంటాయి.
Free Skill Development Training Program: తెలంగాణలోని బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగం పొందే అవకాశాన్ని బీసీ స్టడీ సర్కిల్ కల్పిస్తుంది. హైదరాబాద్‌లోని కుషాయిగూడ ఎల్జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీలో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణకు బీసీ స్టడీ సర్కిల్ దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు గడువు చివరిరోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను సంస్థ ప్రకటించనున్నారు. ఎంపికైనవారికి సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30 వరకు శిక్షణ కొనసాగనుంది.
హైదరాబాద్‌లోని కుషాయిగూడ ఎల్జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీలో 90 రోజుల పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వనున్నారు. అంటే ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు. మధ్యాహ్న భోజనం వసతి మాత్రం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షికాదాయం 5 లక్షలకు మించకూడదు. కోర్సు పూర్తయిన తర్వాత నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) నుంచి లెవల్-4 సర్టిఫికేట్ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తారు. మంచి హాజరు ఉన్నవారికి శిక్షణ కాలంలో నెలకు రూ.4 వేల చొప్పున స్టయిపెండ్ ఇస్తారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 040-24071178 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
వివరాలు..
* స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
కేంద్రం: ఎల్జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ, కుషాయిగూడ-హైదరాబాద్
శిక్షణ అంశాలు..
1) రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, ఏసీ రిపేర్ అండ్ ఇన్‌స్టలేషన్.
సీట్ల సంఖ్య: 50.
శిక్షణకాలం: 90 రోజులు.
అర్హత: పదోతరగతి/ ఐటీఐ/డిప్లొమా/ ఇంటర్/ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
2) గ్యాస్ చార్జింగ్ అండ్ ఎల్‌ఈడీ టీవీ, ఓఎల్‌ఈడీ మానిటర్, మైక్రోవేవ్ ఓవెన్, వాటర్ ప్యూరిఫైయిర్, బేసిక్ హోం అప్లియన్స్ రిపేర్ అండ్ ఇన్‌స్టలేషన్.
సీట్ల సంఖ్య: 50.
శిక్షణకాలం: 90 రోజులు.
అర్హత: పదోతరగతి/ ఇంటర్/ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
స్టైపెండ్: శిక్షణ సమయంలో 90 శాతానికి పైగా హాజరుశాతం ఉన్నవారికి 3 నెలలపాటు రూ.4000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.
శిక్షణ వివరాలు: ఎంపికైనవారికి మొత్తం 3 నెలలు (90 రోజుల) సంబంధిత విభాగంలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వీరికి స్టడీ మెటీరియల్, మధ్యాహ్న భోజనం, టీషర్ట్, బ్యాగ్, బేసిక్ టూల్ కిట్, సర్టిఫికేషన్ (లెవల్-4) ఇవ్వడంతోపాటు ఇండియాలో లేదా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎల్జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ కల్పిస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.08.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.08.2024.
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: తర్వాత ప్రకటిస్తారు.
చిరునామా:
LG Hope Technical Skill Academy,
NSIC Electronic Complex, ECIL,
Kamalanagar, Near Radhika Asian Theater,
Beside HP Petrol Bunk, Hyderabad.