AP: ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం, టీచర్లకు కీలక సూచనలు
ఏపీలోని పాఠశాలల విద్యార్థులకు 11 రోజుల దసరా సరదాలు అక్టోబరు 24తో ముగిశాయి. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం (అక్టోబరు 25) నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
ఏపీలోని పాఠశాలల విద్యార్థులకు 11 రోజుల దసరా సరదాలు అక్టోబరు 24తో ముగిశాయి. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం (అక్టోబరు 25) నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ హాజర్ విధానానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.
విద్యార్థుల హాజరును యాప్‌లో ఉదయం 9.30 గంటల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదయం 9:00 గంటల కల్లా ఉపాధ్యాయులు హాజరు ప్రక్రియ పూర్తిచేయాలి. ప్రత్యేక విధులకు దరఖాస్తు చేసిన టీచర్లు కచ్చితంగా వెళ్లిన ప్రదేశం నుంచి మళ్లీ హాజరు వేయాల్సి ఉంటుంది.
ఇక సెలవు పెట్టుకునే టీచర్లు ఉదయం 9 గంటల కంటే ముందే యాప్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించకపోతే మెమోలు జారీ చేస్తామని హెచ్చరిస్తూ ఐటీ సెల్ ఆదేశాలను జారీ చేసింది. పాఠశాల హాజరు యాప్‌లో సైతం పలు మార్పులు తీసుకొచచినట్లు పేర్కొంది.
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చింది. దసరా సెలవులు అక్టోబరు 24తో ముగియగా.. నేటి నుంచి (అక్టోబరు 25) నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
జూనియర్ కాలేజీలు రేపటి నుంచి..
ఏపీలోని పాఠశాలలకు 11 రోజుల దసరా సెలవులు రాగా.. ఇంటర్ కాలేజీలకు మాత్రం కేవలం వారం రోజులే సెలువులు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు అక్టోబరు 19 నుంచి సెలవులు ఇవ్వగా.. అక్టోబర 25తో సెలవులు ముగియనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అక్టోబరు 26న పునఃప్రారంభంకానున్నాయి.
ALSO READ:
యూడైస్‌లో పేరుంటేనే ‘టెన్త్’ పరీక్షలకు అనుమతి, ఇక ఆన్‌లైన్‌లోనే నామినల్ రోల్స్
తెలంగాణలో పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే 'యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)'లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అక్టోబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్‌రోల్స్‌ను పంపిస్తాయి. అనుమతి లేని పాఠశాలల్లో చదివే పిల్లలను మరో బడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఇప్పటి నుంచి యూడైస్‌లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని 27 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..