అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్‌-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి విడుల చేసింది.

AP POLYCET 2024: ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్‌-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసింది. పాలిసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభంకానుంది.  దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్‌ 5 చివరితేది కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు...

* ఏపీ పాలిసెట్ - 2024

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, ఈ ఏడాది మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్నవారు పాలిసెట్‌ దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా .

ప్రవేశాలు కల్పించే సంస్థలు: పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

పరీక్ష విధానం: పాలిసెట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్‌–50, ఫిజిక్స్‌–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానంలో అమల్లో లేదు.

డిప్లొమా కోర్సులు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.04.2024.

➥ పాలిసెట్ పరీక్షతేది: 27.04.2024.

POLYCET previous years (2014-2022) papers

Website

AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ALSO READ:

ప్రైవేట్‌ స్కూళ్లలో 'ఉచిత' ప్రవేశాలకు అవకాశం, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న వెలువడింది. వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. . విద్యార్థులు ఫిబ్రవరి 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: polycet-te@telangana.gov.in లేదా 040 -23222192 ఫోన్ నెంబరులో సంప్రదించాలని సూచించారు. పాలిసెట్‌-2024 ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget