TS POLYCET: పాలిసెట్లో తొలిసారి స్లైడింగ్ విధానం! నచ్చిన బ్రాంచ్‌కు మారవచ్చు!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇక నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇక నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పాలిసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు పాలిసెట్లో రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించి, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ జరుపుతున్నారు. ఈసారి రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి స్లైడింగ్ నిర్వహిస్తారు. ఈ విధానం ద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి విద్యార్థులు చేరవచ్చు.
ఈ ప్రక్రియను కన్వీనర్ ఆధ్వర్యంలో జరపడం వల్ల విద్యార్థులు మరో బ్రాంచికి మారినా బోధనా రుసుములు(ఫీజు రీయింబర్స్‌మెంట్) పొందేందుకు అర్హులవుతారు. ఇప్పటివరకు స్లైడింగ్ లేకపోవడం, రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ ప్రవేశాలు జరుపుతుండటం వల్ల పాలిసెట్లో కనీస అర్హత పొందని వారు కూడా డిమాండ్ ఉన్న సీట్లలో చేరుతున్నారు. మెరిట్తో ఇతర బ్రాంచీల్లో చేరిన వారికి అవి దక్కడం లేదు. ఈ విషయాన్ని పాలిసెట్ ప్రవేశాల అధికారులు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఇన్ఛార్జి కమిషనర్, పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్లైడింగ్కు ఆమె అంగీకారం తెలిపినట్లు తెలిసింది. స్లైడింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
స్పాట్ ప్రవేశాల బాధ్యత యాజమాన్యాలదే!
రాష్ట్రంలో ఇప్పటివరకు పాలిసెట్లో స్పాట్ ప్రవేశాలను కన్వీనర్ ఆధ్వర్యంలో జరుపుతుండగా, ఇక నుంచి వాటిని కళాశాలల యాజమాన్యాలకే అప్పగించనున్నారు. స్పాట్ను వారికి ఇచ్చినా పాలిటెక్నిక్ కోర్సులకు డొనేషన్లు ఇచ్చే పరిస్థితి లేనందున అక్రమాలకు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 60 ప్రైవేట్ కళాశాలలున్నాయి. మొత్తం 29,396 సీట్లున్నాయి. పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ముగియగా, చివరి విడత సీట్లను గురు లేదా శుక్రవారాల్లో కేటాయించనున్నారు.
ALSO READ:
9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?
ఈ కాలంలో చదువు అంటే ఆర్థిక భారం మోయాల్సిందే. చిన్న పాటి ప్రైవేటు స్కూలులో, కాలేజీలు చేర్పించినా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. లక్షలు లేనిది ఉన్నతవిద్య అందడం లేదు. చాలా మంది విద్యార్థులు చదువుకు అయ్యే ఖర్చుకు భయపడి మధ్యలోనే మానేస్తుంటారు. కొంత మంది చదువులో బాగా రాణించినా తదుపరి విద్య కోసం డబ్బు పెట్టే స్తోమత లేక డ్రాపవుట్స్ గా మిగిలిపోతుంటారు. అలాంటి విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చినవే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు. అర్హత, ప్రాంతం, అవసరానికి అనుగుణంగా దరఖాస్తు చేయడం ద్వారా స్కాలర్‌షిప్ లు పొందవచ్చు. చాలా స్కాలర్ షిప్‌లకు విద్యార్థి చదువులో ప్రతిభ కనబరచడమే అర్హత. మరికొన్ని స్కాలర్‌షిప్‌లకు చదువుతో పాటు వెనకబడిన కులాలకు చెందిన వారు అయి ఉండాలి. 9వ తరగతి నుంచి పీజీ లాంటి ఉన్నత విద్య అభ్యసించేంత వరకు రకరకాల స్కాలర్ షిప్ లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial