(Source: ECI/ABP News/ABP Majha)
TS CETS 2023: ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో, ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా యూనివర్సిటీల వీసీలు, ప్రవేశ పరీక్షల కన్వీనర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రవేశ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కన్వీనర్లను, అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల లోకేషన్లను గుర్తించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. హాల్ టికెట్‌పై ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 18న ఎడ్‌సెట్, మే 20న ఈసెట్, మే 25న లాసెట్, పీజీ ఎల్‌సెట్, మే 26న ఐసెట్, మే 29 నుంచి జూన్1 వరకు పీజీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష | కన్వీనర్ | యూనివర్సిటీ |
టీఎస్ ఎంసెట్ | ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ | జేఎన్టీయూ-హైదరాబాద్ |
టీఎస్ పీజీ ఈసెట్ | ప్రొఫెసర్ బి. రవీంద్ర రెడ్డి | జేఎన్టీయూ-హైదరాబాద్ |
టీఎస్ ఐసెట్ | ప్రొఫెసర్ పి. వరలక్ష్మి | కాకతీయ యూనివర్సిటీ |
టీఎస్ ఈసెట్ | ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ | ఉస్మానియా యూనివర్సిటీ |
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ | ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి | ఉస్మానియా యూనివర్సిటీ |
టీఎస్ ఎడ్‌సెట్ | ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ | మహాత్మా గాంధీ యూనివర్సిటీ |
టీఎస్ పీఈసెట్ | ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ | శాతవాహన యూనివర్సిటీ |
Also Read:
ఏప్రిల్ 20 నుంచి 'సమ్మెటివ్-2' ఎగ్జామ్స్, పరీక్షల సమయాల్లో మార్పులు!
ఏపీలో ఏప్రిల్ 20 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా 'సమ్మెటివ్-2' పరీక్షల సమయాలను మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చిన సమయం ప్రకారం 1 - 8 తరగతులకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 8 గంటల నుంచి 11.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి, విద్యార్థులను పంపిస్తారు. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సిల్వర్ సెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..