అన్వేషించండి

ఇంజినీరింగ్‌ కాలేజీలపై కొరడా, అధిక ఫీజులు వసూలు చేసినందుకు 2 లక్షల ఫైన్!

అధికంగా ఫీజులను కొన్ని కాలేజీలు వసూలు చేశాయని టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఆయా కాలేజీలను విచారించిన కమిటీ సుమారు 15 నుంచి 20 కాలేజీలు అధిక ఫీజులకు పాల్పడినట్లు గుర్తించింది. 

విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్‌ కాలేజీలపై తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కొరడా ఝుళిపించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన సుమారు 15 నుంచి 20 కాలేజీలకు జరిమానా విధించింది. అక్రమ పద్ధతుల్లో ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలకు ఒక్కో ఫిర్యాదుపై రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం ఫీజులు వసూలు చేయకుండా అధికంగా ఫీజులను కొన్ని కాలేజీలు వసూలు చేశాయని టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. దాదాపు 26 కాలేజీలపై ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఆయా కాలేజీలను విచారించిన కమిటీ సుమారు 15 నుంచి 20 కాలేజీలు అధిక ఫీజులకు పాల్పడినట్లు గుర్తించింది. 

గురునానక్‌ విద్యాసంస్థలోని రెండు కాలేజీలు, కేఎంఐటీకి చెందిన రెండు, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన మూడు, శ్రీఇందు విద్యాసంస్థలకు చెందిన రెండు కాలేజీలకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులకు మించి వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని టీఏఎఫ్‌ఆర్‌సీ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా పలు కాలేజీలు టీఏఎఫ్‌ఆర్‌సీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న టీఏఎఫ్‌ఆర్‌సీ సంబంధిత కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. కాగా, ఈ అంశంపై కాలేజీల యాజమాన్యాలు కోర్టుకెళ్లనున్నట్టు తెలిసింది.

విధించిన జరిమానాను కాలేజీలు త్వరలో కట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తూ అక్టోబర్‌ 19న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఫీజులను ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌ కనిష్ట ఫీజు రూ.45, గరిష్ట ఫీజును రూ.1.60 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉంది. అయితే కొన్ని కాలేజీలు తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేశాయి. దీనిపై టీఏఎఫ్‌ఆర్‌సీకి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కమిటీ చర్యలు చేపట్టింది. అయితే ఈ అంశంపై కాలేజీలు కోర్టుకెళ్లనున్నట్లు సమాచారం.

త్వరలో మరికొన్నింటిపై చర్యలు!
ప్రస్తుతం ఇరవైకి పైగా కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ జరిమానా విధించగా, త్వరలోనే మరికొన్నింటిపై చర్యలు తీసుకొనే అవకాశాలున్నట్టు తెలిసింది. మరికొన్ని ఫిర్యాదులు టీఏఎఫ్‌ఆర్‌సీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వాటిపై విచారణ జరిపి అధిక ఫీజులు వసూలు చేసినట్టు తేలితే వాటికి సైతం జరిమానా విధిస్తామని టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు పేర్కొంటున్నారు.


Also Read:

హైద‌రాబాద్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌, ఇక ఈ బస్సుల్లోనూ కాలేజీకీ వెళ్లొచ్చు!
హైద‌రాబాద్ నగర విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో న‌డిచే అన్ని బ‌స్సుల్లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. అంటే సిటీ బ‌స్సుల‌తోపాటు ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. విద్యార్థుల ర‌ద్దీ దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం ఈ నిర్ణయం తీసుకుంద‌ని, స‌దుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాల‌ని ఆయన కోరారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, వివరాలివే!
ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సి) ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంపై ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తోంది. డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించనున్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌‌పై 10 రోజులపాటు ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సును నిర్వహించనున్నారు.
కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget