OU PhD Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు, వీరు మాత్రమే అర్హులు
OU Ph.D. programme: ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. యూజీసీ నెట్ / సీఎస్‌ఐఆర్ నెట్/ ఐసీఏఆర్/ ఐసీఎంఆర్/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.
OU Admission Notification into Ph.D. programme for the year 2024: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీ-1 కింద సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఇంజినీరింగ్, ఆర్ట్స్, లా విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జులై 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. తేదీలోపు దరఖాస్తులను సంబంధిత ఫ్యాకల్టీల డీన్ కార్యాలయంలో అందజేయాలి. సంబంధిత విభాగంలో పీజీతో పాటు యూజీసీ నెట్/ సీఎస్‌ఐఆర్ నెట్/ ఐసీఏఆర్/ ఐసీఎంఆర్/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్ నుంచి జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.
ప్రోగ్రామ్ వివరాలు...
* డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ప్రోగ్రామ్
విభాగాలు..
➥ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్
➥ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్
డిపార్ట్‌మెంట్లు: ఆస్ట్రోనమీ, అప్లయిడ్ జియోకెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బోటనీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, జియోలజీ, జియోఫిజిక్స్, జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రీషన్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ.
➥ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్
డిపార్ట్‌మెంట్లు: ఇంగ్లిష్, హిందీ, కన్నడ, లింగ్విస్టిక్స్, పర్షియన్, ఫిలాసఫీ, సంస్కృతం.
➥ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్
డిపార్ట్‌మెంట్లు: ఎకనామిక్స్, హిస్టరీ, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ.
➥ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్
డిపార్ట్‌మెంట్లు: బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.
➥ ఫ్యాకల్టీ ఆఫ్ లా
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/ సీఎస్‌ఐఆర్/ ఐసీఏఆర్/ ఐసీఎంఆర్/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్ నుంచి జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు ఫీజు: రూ.1,500. అభ్యర్థులు సంబంధిత విభాగానికి చెందిన డీన్ పేరిట ఏదైనా జాతీయబ్యాంకు నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, డీడీతోపాటు అవసరమైన సర్టిఫికేట్ కాపీలు జతచేసి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని సంబంధిత విభాగాల డీన్ కార్యాలయాలల్లో సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: యూనివర్సిటీ, యూజీసీ నిబంధనలు అనుసరించి ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు జతచేయాల్సిన డాక్యుమెంట్లు..
➥ సంబంధిత విభాగానికి చెందిన డీన్ పేరిట ఏదైనా జాతీయబ్యాంకు నుంచి తీసిన రూ.1500 డిమాండ్ డ్రాఫ్టును జతచేయాలి.
➥ జేఆర్ఎఫ్/ఇతర నేషనల్ లెవల్ ఫెలోషిప్ లెటర్ కాపీలు జతచేయాలి. (2 కాపీలు).
➥ యూజీ, పీజీ మార్కుల మెమోలతోపాటు పదోతరగతి నుంచి పీజీ వరకు సంబంధించిన అన్నిరకాల సర్టిఫికేట్లు జతచేయాలి. (2 కాపీలు)
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (2 కాపీలు).
➥ ఆధార్ కార్డు (2 కాపీలు).
➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 22.07.2024 (5 PM).
➥ దరఖాస్తుల (ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్) సమర్పణకు చివరితేదీ: 20.07.2024 (5 PM).
➥ ఇంటర్వ్యూలు (ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్): ఆగస్టు 5 నుంచి 14 వరకు.
➥ ప్రవేశాలకు చివరితేది (ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్): 19.08.2024.