అన్వేషించండి

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2024 పేపర్-2 అడ్మిట్‌కార్డు విడుదల, పరీక్ష వివరాలు ఇలా

జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి పేపర్-2 అడ్మిట్‌కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' జనవరి 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది.

JEE Mains Exam Admitcard: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి పేపర్-2 అడ్మిట్‌కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' జనవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఇందులో జనవరి 27, 29, 30, 31 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనుండగా.. జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 19 నుంచి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

JEE Main 2024 పేపర్-2 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2024 పేపర్-2 అడ్మిట్‌కార్డు విడుదల, పరీక్ష వివరాలు ఇలా

దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌(JEE Main)-2024 తొలి విడత పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 12.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 3.70 లక్షలు అధికంగా ఉండటం విశేషం. ఈ సారి అత్యధిక దరఖాస్తుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. మహారాష్ట్ర నుంచి 1.60 లక్షల మంది, ఏపీ నుంచి 1.30 లక్షలు, తెలంగాణ నుంచి 1.20 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరొచ్చు. బీటెక్‌ సీట్ల కోసం మెయిన్‌లో పేపర్‌-1, బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌-2 రాయాల్సి ఉంటుంది.

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IITs), ఎన్‌ఐటీలు(NITs), ట్రిపుల్‌ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 

ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్‌, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.

పరీక్ష విధానం..

➥పేపర్‌-1(బీటెక్, బీఈ) ఇలా..
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు.  సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష..
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.  డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.

➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది.  మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు.  బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ రెండు పేపర్లకు మూడున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. 

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2024 పేపర్-2 అడ్మిట్‌కార్డు విడుదల, పరీక్ష వివరాలు ఇలా

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget