By: ABP Desam | Updated at : 03 Aug 2022 11:19 PM (IST)
JEE Main 2022 Answer Key
జేఈఈ మెయిన్ రెండో విడత (సెషన్-2)కు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఆగస్టు 3న విడుదలచేసింది. ఆన్సర్ కీతోపాటు క్వశ్చన్ పేపర్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ/బీటెక్), పేపర్-2ఎ (బీఆర్క్), పేపర్-2బి (బీప్లానింగ్) పరీక్షల ఆన్సర్ కీని రెస్పాన్స్‌లతో సహా ఎన్టీఏ అందుబాటులో ఉంచింది.
ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5న సాయంత్రం 5 గంటల్లోగా తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పేటీమ్ ద్వారా ఫీజు చెల్లించాలి. మరే ఇతర మార్గాల్లోనూ చెల్లించే అవకాశం లేదు. ఈ ఫీజు నాన్ రిఫండబుల్.
Notification
JEE(Main) 2022 Session 2, Display Question Paper and Answer Key
ప్రాథమిక కీపై అభ్యంతరాల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తుది ఆన్సర్ కీ, అభ్యర్థుల వ్యక్తిగత స్కోరు కార్డు, మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్-2022 సెషన్-2 పరీక్ష ఫలితాలు ఆగస్టు 6న ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించిన సంగతి తెలిసిందే. తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటించనున్నారు.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30 వరకు జరిగాయి. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అంతకుముందు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్ 100 పర్సంటైల్ సాధించడం విశేషం.
Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షను జులై 21 నుంచి నిర్వహించింది. ఆ తర్వాత తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటించబడతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది.
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హాజరుకావచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలను మాత్రమే ఎన్‌టీఏ ప్రకటించింది. సెషన్-2 పరీక్ష తర్వాత అభ్యర్థుల ర్యాంక్‌లు ప్రకటించబడతాయి.
Also Read: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!
ఇలా చెక్ చేసుకోండి..
Step 1: అభ్యర్థులు మొదటగా jeemain.nta.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: హో పేజీలో ''JEE(Main) 2022 Session 2, Display Question Paper and Answer Key'' అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4: అభ్యర్థి తనకు అనువైన వివరాలతో లాగిన్ కావచ్చు.
Step 5: అనంతరం మీ రిజల్ట్ స్క్రీన్ పై క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ దర్శనమిస్తాయి. ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
HORTICET - 2022: ఏపీ హార్టీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
NEET 2022 Result: నేడు నీట్ ఆన్సర్ కీ విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?
BRAOU: భారమైన 'దూరవిద్య' - అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు డబుల్!
Medical PG counselling: పీజీ వైద్యవిద్య కౌన్సెలింగ్ ఎప్పటినుంచంటే?
TS DEECET: ఆగస్టు 22 నుంచి డీఈఈసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్!
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం