అన్వేషించండి

CUET UG: సీయూఈటీ- 2024 నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభం, ముఖ్యమైన తేదీలివే

దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ CUET UG-2024" నోటిఫికేషన్‌ను 'NTA' ఫిబ్రవరి 27న విడుదల చేసింది.

CUET UG 2024 Notification: దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఫిబ్రవరి 27న ప్రారంభించింది. సరైన అర్హతలున్నవారు మార్చి 26 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 15 నుంచి 31 మధ్య సబ్జెక్టులవారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.  జూన్ 30న ఫలితాలు వెల్లడిస్తారు. 

సీయూఈటీ యూజీ స్కోరు ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశాలు కల్పిస్తాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.

వివరాలు..

* కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ) - 2024

అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:

CUET UG: సీయూఈటీ- 2024 నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభం, ముఖ్యమైన తేదీలివే

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: సీయూఈటీ (యూజీ)-2024 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ప్రవేశ పరీక్ష ఆధారంగాగా.

పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

CUET UG: సీయూఈటీ- 2024 నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభం, ముఖ్యమైన తేదీలివే

ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపుంపరే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపర్తి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్‌నగర్.

* సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు
సీయూఈటీ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ప్రముఖ కేంద్రియ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి.

ముఖ్యమైన తేదీలు..

➸ సీయూఈటీ  యూజీ -2024 నోటిఫికేషన్:  27.02.2024.

➸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.02.2024.

➸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.03.2024  (రాత్రి 11:50 వరకు).

➸ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26.03.2024  (రాత్రి 11:50 వరకు).

➸ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్: 28.03. 2024 - 29.03.2024 (రాత్రి 11:50 వరకు).

➸ పరీక్ష కేంద్రాల ప్రకటన: 30.04.2024 నుంచి.

➸ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2024.

➸ పరీక్ష ప్రారంభతేదీ: మే 15 నుండి మే 31, 2024 వరకు

ఫలితాల ప్రకటన: 30.06.2024.

Public Notice

Notification 

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Chahal - Dhanashree Verma Divorce: చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Karantaka Assembly: మగాళ్లు అల్లాడిపోతున్నారయ్యా… వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి- అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థన
మగాళ్లు అల్లాడిపోతున్నారయ్యా… వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి- అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థన
Embed widget