(Source: ECI/ABP News/ABP Majha)
MBBS: జులై 21 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ దివ్యాంగ అభ్యర్థులకు అసెస్‌మెంట్!
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగ అభ్యర్థులు జులై 21 నుంచి అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగ అభ్యర్థులు జులై 21 నుంచి అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు వారికి నిర్దేశించిన తేదీల్లో మెడికల్ బోర్డు ఎదుట హాజరుకావాలని వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ జులై 18న ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నిమ్స్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బోర్డుముందు హాజరు కావాలంది. జులై 21న ఒకటో ర్యాంకు నుంచి 5 లక్షల ర్యాంకు వరకు, జులై 22న 5 లక్షల పైన.. 7.5 లక్షల వరకు ర్యాంకు పొందినవారు, జులై 23న 7.5 లక్షలకు పైన ర్యాంకు వచ్చిన అభ్యర్థులు హాజరుకావాలని వర్సిటీ సూచించింది.
ALSO READ:
ఓయూ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, 2023-24 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో (ఫేజ్-1) అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పీజీ కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం; డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం, బీబీఏ ఉన్నాయి. అలాగే వివిధ విభాగాల్లో అడ్‌వాన్స్‌డ్ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్-1 అడ్మిషన్లు జులై 20న ప్రారంభం కానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ ఆలిండియా లెవల్ తొలిదశ కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది కూడా పాత విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. నీట్-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగానూ.. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తొలిదశ కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాతే.. రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు మొదటి రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్న ఇంజినీరింగ్ కళాశాలలు జులై 28లోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటికి యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లేదా న్యాక్, ఎన్‌బీఏ గ్రేడ్ తప్పనిసరిగా ఉండాలి. పరిశోధనల కోసం రూ.25 లక్షలతో కార్పస్ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలను విశ్వవిద్యాలయ సలహా కమిటీ పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు అనుబంధ కళాశాలలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చు. జేఎన్‌టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ అనుమతి పొందాకే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial