KNRUHS PG Admissions: కన్వీనర్ కోటా పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్, వివరాలు ఇలా
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీట్ల భర్తీకి జనవరి 12 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించారు.
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీట్ల భర్తీకి జనవరి 12 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించారు. పీజీ మెడికల్ ఖాళీ సీట్ల భర్తీకి మరో అవకాశం కలిపిస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్పెషల్ 'స్ట్రే' విడత ప్రవేశాలకు జనవరి 11న నోటిఫికేషన్ విడుదల చేసింది.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్ పూర్తి చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను చివరి విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇవాళ సాయింత్రం 5 గంటల నుండి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
నోటిఫికేషన్..
సీట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..
బీఎస్సీ ఎంఎల్‌టీ ఫైనల్ పరీక్షల తేదీలు వెల్లడి..
బీఎస్సీ ఎంఎల్‌టీ చివరి సంవత్సరం రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల తేదీలను ప్రకటించింది. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నట్లు తెలపింది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. వీటిలో ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మార్కుల మెమోకు రూ.300, ప్రాసెసింగ్ ఫీజు రూ.350, ప్రొవిజినల్ కోసం రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 3 నుంచి 10 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆలస్య రుసుముతో మార్చి 17 వరకు ఫీజు చెల్లించవచ్చు.
పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
టీఎస్ పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి 11న వెలువడింది. వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనవరి 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 25 వకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 15న వెల్లడిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 - 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..