News
News
X

CUET: నీట్‌, జేఈఈ విలీనం ఇప్పట్లో లేదు! స్పష్టం చేసిన కేంద్ర మంత్రి!!

యూనివ‌ర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)తో ఇంజినీరింగ్ కోర్సుల ఎంట్రెన్స్ జీఈఈ, వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ను విలీనం చేసే ప్రణాళికే లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది.

FOLLOW US: 

యూనివ‌ర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)తో ఇంజినీరింగ్ కోర్సుల ఎంట్రెన్స్ జీఈఈ, వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ను విలీనం చేసే ప్రణాళికే లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. భ‌విష్యత్‌లో సీయూఈటీతో నీట్‌, జేఈఈల‌ను విలీనం చేస్తామ‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) చైర్మన్ జ‌గ‌దీశ్ కుమార్ గ‌త నెల‌లో ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సెప్టెంబరు 6న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్ ఈ మేరకు స్పష్టం చేశారు. 

సీయూఈటీలో నీట్‌, జేఈఈ విలీనం కోసం కేంద్రం సూత్రప్రాయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేద‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్ తేల్చి చెప్పారు. విద్యార్థులు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. సీయూఈటీలో నీట్‌, జేఈఈ విలీనం చేయ‌డానికి క‌నీసం రెండేళ్ల సమయం ప‌డుతుంద‌న్నారు.

నూత‌న విద్యా విధానానికి అనుగుణంగా వ‌చ్చే రెండేళ్లలో కొత్త పాఠ్య పుస్తకాలు వ‌స్తాయ‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వ‌చ్చే ఫిబ్రవ‌రి నుంచి స్కూళ్లలో బాల్ వాటిక (కిండ‌ర్ గార్డెన్‌) అనే పేరుతో ఐదేళ్ల ఫౌండేష‌న్ కోర్సుకు పుస్తకాలు పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. దేశంలోని విద్యార్థులు ఒక‌టి కంటే ఎక్కువ విద్యా కోర్సుల‌ను అభ్యసించ‌డానికి వీలుగా ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ సార‌ధ్యంలోని కేంద్ర ప్రభుత్వం డిజిట‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింద‌న్నారు.

విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకే విలీనం: యూజీసీ
ఇంజినీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్టులను సీయూఈటీ-యూజీలో విలీనం చేసే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కసరత్తులు చేస్తోంది. మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలకు వేరువేరుగా ఎంట్రన్స్‌ టెస్టులు రాయకుండా ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాసి ఆయా సబ్జెక్టుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అంటే ఒకే సింగిల్‌ ఎగ్జాం రాయడం ద్వారా వివిధ సబ్జెక్టుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చని యూజీసీ చైర్మన్‌ ఎమ్‌ జగదీష్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌కు రాసే జేఈఈ మెయిన్‌, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష, సీయూఈటీ యూజీ పరీక్షతో కలిపి మొత్తం 3 మేజర్ ఎంట్రన్స్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీటికి దేశ వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. మెజారిటీ స్టూడెంట్స్ వీటిల్లో కనీసం రెండు పరీక్షలకైనా హాజరవుతున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను అటెంప్ట్‌ చేస్తున్నారు. నీట్‌ యూజీ పరీక్షలో కూడా మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టును బయాలజీ రీప్లేస్‌ చేస్తుంది. ఈ సబ్జెక్టులన్నీ కూడా సీయూఈటీ- యూజీలో ఉన్న 61 విభాగాల్లో ఇప్పటికే ఉన్నాయి. రకరకాల ఎంట్రన్స్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్ధులు ఒత్తిడికి గురికాకూడదనే తాజా ప్రతిపాదన ప్రధాన లక్ష్యం. ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించే దిశగా యూజీసీ చర్చలు జరుపుతోంది. తద్వారా విద్యార్దులు ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షను రాయడానికి అవకాశం ఉంటుంది. బోర్డు పరీక్షల తర్వాత ఒకసారి, డిసెంబర్‌లో మరొకసారి రాయవచ్చని జగదీష్‌ కుమార్ అన్నారు.

Also Read:
'గేట్' తెరచుకుంది, దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఎప్పుడో తెలుసా?
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ చదవాలన్నా, నేరుగా పీహెచ్‌డీ చేయాలన్నా.. 'గేట్' అర్హత ఉండాల్సిందే. గేట్‌లో వచ్చే స్కోరు ఆధారంగానే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఐఐటీ కాన్పూర్ జులై 27న 'గేట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గేట్-2023 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయిన, చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్‌ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి

Also Read:
'జామ్' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
బయో టెక్నాలజీ, సైన్స్ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2023’ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐఐటీ గువహటీ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్‌ స్కోర్‌ ద్వారా భర్తీ చేస్తారు. వీటితోపాటు నిట్‌లు(NIT), ఐసర్లు(IISER), ఐఐఎస్సీ(IISC), ఐఐఈఎస్‌టీ(IIEST), డీఐఏటీ(DIAT), ఐఐపీఈ(IIPE), జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ (JNCASR), ఎస్‌ఎల్‌ఐఈటీ (SLIET) సహా మొత్తం 30 సీఎఫ్‌టీఐ సంస్థల్లోని 2300కు పైగా సీట్ల భర్తీకి ఈ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటారు.
నోటిఫికేషన్‌ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 08 Sep 2022 01:55 PM (IST) Tags: CUET Common University Entrance Test jee pradhan university grants commission ugc national testing agency dharmendra pradhan

సంబంధిత కథనాలు

Medical Seats : వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, బీ-కేటగిరి సీట్లలో 85 శాతం స్థానికులకే!

Medical Seats : వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, బీ-కేటగిరి సీట్లలో 85 శాతం స్థానికులకే!

TS ICET 2022 Counselling: ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!

TS ICET 2022 Counselling: ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!

NORCET - 2022 Result: నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

NORCET - 2022 Result: నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

EAMCET Counselling: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!

EAMCET Counselling: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!

MAT Result 2022: మ్యాట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!

MAT Result 2022: మ్యాట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు