ABP Education Group:విద్యార్థుల భవిష్యత్‌కు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వరం- హైదరాబాద్‌లో 'న్యూ గ్రామర్ విత్ ఎ స్మైల్' పు్స్తకం రిలీజ్
Education News: ABP ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహించిన హెడ్‌వర్డ్ భాష, కమ్యూనికేషన్ వర్క్‌షాప్‌లో 70కిపైగా CBSE, ICSE స్కూల్స్ నుంచి ప్రతినిధిలు పాల్గొన్నారు.
ABP Education Group News: కమ్యూనికేషన్‌లో పదజాలం, వ్యక్తీకరణ ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఏబీపీ ఎడ్యుకేషన్ గ్రూప్‌లో భాగమైన హెడ్‌వర్డ్ ఓ వర్క్‌షాప్ నిర్వహించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో 70కిపైగా CBSE, ICSE పాఠశాలలకు చెందిన 170 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మనం మాట్లాడే ప్రతి పదం చాలా ముఖ్యమని గుర్తించేలా... పాల్గొన్న వారి నైపుణ్యాలు పెంచే లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ వర్క్‌షాప్‌లో ABP ఎడ్యుకేషన్ గ్రూప్ CEO యష్ మెహతా, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శశి గుడిబండి, ప్రఖ్యాత విద్యావేత్త, రచయిత బారీ ఓ బ్రియన్ పాల్గొన్నారు. మాటతీరుతో వచ్చిన వారిని బ్రియన్ ఆకర్షించారు. తరగతి గదుల్లో సమర్థవంతమైన కమ్యూనికేషన్ అమలు చేయాలనే ఉత్సుకతను వారిలో కలిగించారు.
బారీ ఓ బ్రియన్ రాసిన "న్యూ గ్రామర్ విత్ ఎ స్మైల్" గ్రామర్ గైడ్‌ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. విషయాన్ని వ్యక్తం చేసే నైపుణ్యానికి వకాబులరీ జత అయితే కమ్యూనికేషన్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దీనిని మరింత ప్రభావంతంగా ఈ గ్రామర్ బుక్ తీర్చిదిద్దుతుంది.
"న్యూ గ్రామర్ విత్ ఎ స్మైల్" అనేది విద్యార్థులకు కమ్యూనికేషన్‌లో విశ్వాసాన్ని పెంపొందించడానికి స్పష్టమైన వివరణలు, ఇంటరాక్టివ్ ఎక్సర్‌సైజ్‌లు, ప్రాక్టికల్ అప్లికేషన్లు ఉన్నాయి. తరగతి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విద్యార్థికి గురువులా ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమంలో మాట్లాడి మెహతా...రేపటి జాబ్ మార్కెట్‌కు తగిన నైపుణ్యాలతో విద్యార్థులను సిద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భవిష్యత్ తరాలను మరింత తెలివైన వారిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మెహతా చెప్పరు. NCF 2023, NEP 2020 వంటి జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వినూత్నమైన, అవసరాలకు తగ్గ కంటెంట్‌ను అందించడానికి హెడ్‌వర్డ్ కట్టుబడి ఉందని వివరించారు.
"హెడ్‌వర్డ్ ఖ్యాతి పెంచేందుకు, స్కూల్‌ను భవిష్యత్ అవసరాల కోసం తీర్తిద్దేందుకు ప్రతి మార్పు స్వీకరించేందుకు మా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత విశ్వసనీయ పాఠ్యప్రణాళిక అందించే సంస్థగా మార్చేందుకు శ్రమిస్తున్నారు."అని ABP ఎడ్యుకేషన్ గ్రూప్ CEO మెహతా చెప్పారు.
వర్క్‌షాప్ అధ్యాపకులకు రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా పదజాలం ఇంప్రూవ్ చేసుకోవడం, కమ్యూనికేషన్ పద్ధతులు మార్చుకోవడానికి అవసరమైన వ్యూహాలు అందించింది. విద్యార్థులు తమను తాము నమ్మకంగా ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేసేలా తీర్చిదిద్దింది. .
Also Read; 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూలు వెల్లడి - ముఖ్యమైన తేదీలవే