అన్వేషించండి

 NEET UG 2024: నీట్‌ యూజీ-2024 మాక్‌ టెస్టులు అందుబాటులో, ఇలా ప్రాక్టీస్ చేయండి

NEET UG Mock Tests: నీట్(యూజీ)-2024 ప్రవేశ పరీక్షకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు మాక్ టెస్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అందుబాటులో ఉంచింది.

NEET UG Mock Tests: నీట్(యూజీ)-2024 ప్రవేశ పరీక్షకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు మాక్ టెస్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అందుబాటులో ఉంచింది. ఈ నమూనా పరీక్షలో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా ప్రశ్నలను పొందుపరిచింది. అభ్యర్థులు మాక్‌టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో  మే 5న నీట్‌ యూజీ (NEET UG 2024) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు మొత్తం 23.81లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

నీట్ యూజీ మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి..

అడ్మిట్‌కార్డులు విడుదల..
నీట్ యూజీ (NEET UG) - 2024 ప్రవేశ పరీక్ష అడ్మిట్‌కార్డులను (NEET Admit Card) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రానికి కనీసంగంటన్నర ముందు చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అడ్మిట్‌కార్డుపై ఉన్న నిబంధనలను స్పష్టంగా చదవవాలి. ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించేవి, అనుమతించనవి ఏవో ఉంటాయి. ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలో సూచనలు కూడా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ అభ్యర్థులు పూర్తిగా చదివి అందుకు అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకొని పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

నీట్ యూజీ-2024 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd Test Highlights: టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Indian Smartphone Market: ఆండ్రాయిడ్ ఫోన్లకు షాకిస్తున్న యాపిల్ - ఒక్క శాతం తేడాతో ఆ రికార్డు మిస్!
ఆండ్రాయిడ్ ఫోన్లకు షాకిస్తున్న యాపిల్ - ఒక్క శాతం తేడాతో ఆ రికార్డు మిస్!
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP DesamInd vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desamఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd Test Highlights: టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Indian Smartphone Market: ఆండ్రాయిడ్ ఫోన్లకు షాకిస్తున్న యాపిల్ - ఒక్క శాతం తేడాతో ఆ రికార్డు మిస్!
ఆండ్రాయిడ్ ఫోన్లకు షాకిస్తున్న యాపిల్ - ఒక్క శాతం తేడాతో ఆ రికార్డు మిస్!
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Mysore Pak History: మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!
మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Embed widget